పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోన్న రష్మిక.!

- February 08, 2023 , by Maagulf
పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోన్న రష్మిక.!

రష్మికకు నేషనల్ క్రష్‌గా ఎంత ఫాలోయింగ్ వుందో.. ఏ చిన్ని మాట దొర్లినా, తప్పుకు దొరికినా ఏకి పారేసేవాళ్లు కూడా అంతే ఎక్కువగా వున్నారు.
కానీ, ఇప్పుడు రష్మికను తెగ ఇష్టపడిపోతున్నారు. అందుకు కారణం తాజాగా రష్మిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే. జీవితం చాలా చిన్నది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్ని కలిగించుకోకుండా వున్న చిన్న జీవితంలో సంతోషం వెతుక్కోండి.. అంటూ చాలా పెద్ద స్టోరీనే రాసుకొచ్చింది రష్మిక.
మిగిలిన కథ ఎలా వున్నప్పటికీ, జీవితం చాలా చిన్నది.. సంతోషం వెతుక్కోండి.. అని సూచించిన మాటలు ఫ్యాన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాయ్. అదేంటో రష్మిక హ్యాటర్స్‌కీ కనెక్ట్ కావడంతో, నెట్టింట్లో రష్మికకు లవ్ ఎమోజీలతో కామెంట్లు పోటెత్తాయ్. 
ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్ప 2’తో పాటూ, హిందీలో ‘యానిమల్’ సినిమాలో నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com