నాకు ఆ ట్యాగ్ తగిలించొద్దు అంటోన్న విలక్షణ నటుడు.!

- February 08, 2023 , by Maagulf
నాకు ఆ ట్యాగ్ తగిలించొద్దు అంటోన్న విలక్షణ నటుడు.!

ప్యాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడం ఎంత కష్టమో.. ఆ హోదాని నిలబెట్టుకోవడం అంతకన్నా కష్టం అంటున్నాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.
అవును నిజమే. ఒక్కసారి ప్యాన్ ఇండియా ట్యాగ్ తగిలించుకుంటే.. ఆ బాధ్యతను మోయం అంత సులువు కాదు మరి. అందుకే నాకు ఆ ట్యాగ్ తగిలించొద్దు ప్లీజ్.. అంటున్నాడు విజయ్ సేతుపతి. నేను కేవలం నటుడ్ని మాత్రమే. తమిళ సినిమాలతో పాటూ, తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నాడు విజయ్ సేతుపతి.
అంతేకాదు, నటనకు ఎల్లలు లేవంటున్నాడు. అవకాశం రావాలే కానీ, గుజరాతీ, పంజాబీ.. ఇలా ఏ భాషలోనైనా నటించాలన్నదే నా కోరిక.. అని చెబుతున్నాడు విజయ్ సేతుపతి. తెలుగులో ‘ఉప్పెన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకులకు చాలా క్లోజ్ అయిపోయాడు విజయ్ సేతుపతి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com