'ఆక్సిజన్‌' సెట్‌లో నటుడు బ్రహ్మాజీతో కలిసి గోపీచంద్‌ ..

- May 02, 2016 , by Maagulf
'ఆక్సిజన్‌' సెట్‌లో నటుడు బ్రహ్మాజీతో కలిసి  గోపీచంద్‌ ..

టాలీవుడ్‌ హీరో గోపీచంద్‌ తన తరువాతి చిత్రం 'ఆక్సిజన్‌' సెట్‌లో నటుడు బ్రహ్మాజీతో కలిసి ట్రాక్టర్‌పై చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను బ్రహ్మాజీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా సోమవారం అభిమానులతో పంచుకున్నారు. 'ఆక్సిజన్‌ సెట్‌లో గోపీచంద్‌తో నేను' అని పోస్ట్‌ చేశారు. గోపీచంద్‌ తెల్లని దుస్తులు, నల్లని కళ్లద్దాలతో ట్రాక్టర్‌పై నుంచి ఫొటోకు పోజిచ్చారు.ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన రాశీఖన్నా నటిస్తున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. ఐశ్వర్య నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com