టర్కీ, సిరియాల్లో 21 వేలకు చేరిన మృతుల సంఖ్య
- February 10, 2023
అంకారా: టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాల్లో మరణించిన వారి సంఖ్య 20,783 కు పెరిగింది. ఈ మేరకు CNN నివేదించింది. అలాగే గాయపడిన వారి సంఖ్య 75592 కు చేరుకుంది. టర్కీలో మరణించిన వారి సంఖ్య 17,406కు పెరిగింది. భూకంపం కారణంగా మొత్తం 70,347 మంది గాయపడ్డారని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు. సిరియాలో మొత్తం మరణించిన వారి సంఖ్య3,377కి పెరిగింది. ఇందులో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో 2,030 మంది, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో 1,347 మంది ఉన్నారు. సిరియాలో మొత్తం గాయపడిన వారి సంఖ్య 5,245కి చేరుకుంది. టర్కీలోని భూకంపం ప్రభావిత ప్రావిన్సులలో రెస్క్యూ, సహాయ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి మూడు నెలల అత్యవసర పరిస్థితి చట్టసభ సభ్యుల ఆమోదం తర్వాత గురువారం నుండి అమలులోకి వచ్చింది. కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లో కేంద్రీకృతమై 7.7 మరియు 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపాలకు అదానా, అడియామాన్, దియార్బాకిర్, గాజియాంటెప్, హటే, కిలిస్, మలత్యా, ఉస్మానీ మరియు సాన్లియుర్ఫాతో సహా 10 ప్రావిన్సుల్లో 13 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితం అయ్యారు. సిరియా, లెబనాన్‌తో సహా టర్కీ పొరుగు దేశాలలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 75 దేశాలు, 16 అంతర్జాతీయ సంస్థలు టర్కీకి సహాయాన్ని అందజేస్తున్నాయని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కావుసోగ్లు గురువారం తెలిపారు. 56 దేశాల నుంచి 6,479 మంది రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మరో 19 దేశాలకు చెందిన రెస్క్యూ టీమ్స్ 24 గంటల్లో చేరుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







