65,800 కేసులు నమోదు.. అల్-అసిమా గవర్నరేట్ లో అత్యధికం
- February 10, 2023
కువైట్: కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సాధారణ పరిశోధనల విభాగం 2022లో 65,897 దర్యాప్తు కేసులను నమోదు చేసింది. ఈ మేరకు బుధవారం డిపార్ట్మెంట్ వార్షిక గణాంకాలను విడుదల చేసింది. 2022లో నమోదైన మొత్తం కేసుల్లో 53,485 నేరాలకు సపంబంధించినవి ఉండగా.. 12,412 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నాయి. అల్-అసిమా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ 3,705 నేరాలు, 3,374 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేసింది. మొత్తం 7,079 కేసులు ఈ గవర్నరేట్ లో నమోదయ్యాయి.
ఇక హవల్లీ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం 7,040 నమోదైన కేసులలో 4,338 నేరాలు, 2,702 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు ఉన్నాయి. ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ 1,592 నేరాలు, 1,305 ట్రాఫిక్ ఉల్లంఘనలను(మొత్తం 2,897 కేసులు) నమోదు చేసింది. అల్-అహ్మదీ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (మొత్తం 5,499 కేసులు) 3,549 నేరాలు, 1,950 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేసింది. అల్ఫర్వానియా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ 3,730 నేరాలు, 1,696 ట్రాఫిక్ ఉల్లంఘనలను (మొత్తం 5,426 కేసులు)నమోదు చేసింది. అల్-జహ్రా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ 3,171 నేరాలు, 1,385 ట్రాఫిక్ ఉల్లంఘనలను(మొత్తం 4,556 కేసులు) నమోదు చేసింది. ప్రత్యేక నేరాల దర్యాప్తు విభాగం మొత్తం 33,400 నేరాలను నమోదు చేసిందని వార్షిక గణాంకాలలో తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







