‘అమిగోస్’: మూవీ రివ్యూ

- February 10, 2023 , by Maagulf
‘అమిగోస్’: మూవీ రివ్యూ

‘బింబిసార’ సినిమాతో ఇండస్ర్టీ హిట్ కొట్టి మాంచి హుషారు మీదున్న కళ్యాణ్ రామ్, తక్కువ గ్యాప్‌లోనే ఇంకో సినిమానీ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశాడు. అదే ‘అమిగోస్’.
ఈ సినిమాని మైత్రీ మూవీస్ బ్యానర్‌లో రూపొందించడం వల్ల అంచనాలు బాగున్నాయ్. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాధ్ హీరోయిన్‌గా నటించింది.
‘బింబిసార’తో ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్, ‘అమిగోస్’‌తో ఎలాంటి ఫలితం అందుకోబోతున్నాడో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
ఒకేలా వుండే ముగ్గురు వ్యక్తుల కథ ‘అమిగోస్’ అని ముందే రిలీజ్‌కి ముందే రివీలైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సిద్ధార్ధ్, మంజునాధ్, మైఖేల్ మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ నటించాడు. సిద్దార్ధ్ బిజినెస్ మేన్, మంజునాధ్ సాప్ట్‌వేర్ వుద్యోగి, మైఖేల్ గ్యాంగ్‌స్టర్. అచ్చుగుద్దినట్లు ఒకేలా వుండే ఈ ముగ్గురు వ్యక్తులూ ఓ వెబ్‌సైట్ ద్వారా కలుస్తారు. వీరిలో సిద్ధార్ధ్ రేడియో జాకీ అయిన ఇషికా (ఆషికా రంగనాధ్)ని ప్రేమిస్తాడు. నిశ్చితార్ధం కూడా చేసుకుంటాడు. ఇంతలో తనలాగే వున్న మంజునాధ్‌ని పోలీసులు అరెస్టు చేస్తారు. అందుకు కారణం మైఖేల్ అని తెలుస్తుంది.? అంతేకాదు, మైఖేల్ కారణంగా సిద్దార్ధ్ కూడా చిక్కుల్లో పడతాడు. చివరికి మైఖేల్ నుంచి సిద్దార్ధ్, మంజునాధ్ ఎలా తప్పించుకున్నారు.? తన కారణంగా ఇబ్బందుల్లో ఇరుక్కున్న ఇద్దరినీ మైఖేల్ రక్షిస్తాడా.? లేదా.? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

నటీనటుల పని తీరు విశ్లేషణ:
ఎటువంటి రిలేషన్ లేని మనిషిని పోలిన మనుషులు.. అనే కాన్సెప్ట్‌తోనే చాలా ఆసక్తి కలిగించారు ‘అమిగోస్’పై. అయితే, ఈ సబ్జెక్ట్‌ని తెరపై ఆవిష్కరించడం అంత ఆషా మాషీ కాదని చెప్పాలి. చెప్పాలనుకున్న కథను, గ్రిప్పింగ్‌గా నడిపిస్తేనే ప్రేక్షకుడిలో ఆ ఉత్సుకత వుంటుంది. కానీ, కథనాన్ని ఆశించిన రీతిలో గ్రిప్పింగ్‌గా నడపడంలో డైరెక్టర్ నిరాశపడిచాడనే చెప్పాలి. కథ ఎలాగూ ముందే తెలిసిపోయింది. మరి ఇక కొత్తగా తెరపై ఏం చూపించాడు దర్శకుడు.. అదేగా ప్రేక్షకుడి ఆసక్తి. సినిమా చూస్తున్నంత సేపూ ఆ ఫీల్‌ని అలాగే వుంచలేకపోయాడు డైరెక్టర్.

కళ్యాణ్ రామ్ తన వరకూ మూడు పాత్రలకూ న్యాయం చేసేశాడు. ఆల్రెడీ నెగిటివ్ షేడ్స్ వున్న అనుభవం కూడా బాగానే వున్నందున మూడు పాత్రల్లోనూ వేరియేషన్స్ చాలా ఈజీగా పండించేశాడు. హీరోయిన్ ఆషికా అందంగా కనిపించింది. తన పరిధి మేర నటించింది. మిగిలిన పాత్ర ధారులంతా తమ తమ పరిధి మేర బాగా నటించి మెప్పించారు.

ఫస్టాప్ అంతా చాలా రొటీన్‌గా నడిచిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ‘అమిగోస్’ కథ ట్రాక్ ఎక్కుతుంది. సెకండాఫ్ మొత్తం కళ్యాణ్ రామ్ నెగిటివ్ లుక్ పైనే ఫోకస్ ఎక్కువవుతుంది. విలన్, హీరో మధ్య ఎత్తులూ, పై ఎత్తులతో మళ్లీ రొటీన్ ట్రాక్ ఎక్కుతుంది. పెద్దగా ఎగ్జైట్ అయ్యే సన్నివేశాలేమీ కనిపించకపోవడం సినిమాకి మైనస్. 

సాంకేతిక వర్గం పని తీరు:

గిబ్రాన్ సంగీతం ఓకే అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదు. మాటలు అక్కడక్కడా బాగున్నాయ్. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కొత్త దర్శకుడే అయినా రాజేందర్ రెడ్డి ఈ టిపికల్ స్టోరీని ట్యాకెల్ చేయడంలో ఒకింత ఫర్వాలేదనిపిస్తాడు. కానీ, ఇంకా చాలా స్కోప్ వున్న స్టోరీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. కెమెరా పనితనం థ్రిల్లర్ సినిమాలకు ఆశించిన రీతిలో ఆకట్టుకోలేదు. 

చివరిగా.. ‘అమిగోస్’ నో ఎగ్జైట్‌మెంట్.. జస్ట్ టైమ్ పాస్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com