భారతీయులకు ఉపాధి కల్పిస్తున్న గల్ఫ్ దేశాల జాబితా: అగ్రస్థానంలో సౌదీ అరేబియా

- February 10, 2023 , by Maagulf
భారతీయులకు ఉపాధి కల్పిస్తున్న గల్ఫ్ దేశాల జాబితా: అగ్రస్థానంలో సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: 2022లో భారతీయుల ఉపాధికి సంబంధించి గల్ఫ్ దేశాలలో సౌదీ అరేబియా మొదటి స్థానంలో ఉందని భారత మీడియా నివేదించింది. నివేదికల ప్రకారం.. 2022 సంవత్సరంలో సౌదీ అరేబియా భారతీయులకు 178,630 ఉద్యోగాలను అందించింది.ఈ సంఖ్య 2021లో  32,845 కాగా.. 2020లో 44,316గా ఉంది.  2021 నుండి ఏడు రెట్లు పెరుగుదల రేటుతో కువైట్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. బహ్రెయిన్ 10,232 ఉద్యోగ అవకాశాలతో చివరి స్థానంలో నిలిచింది.2018లో అత్యధిక భారతీయులను స్వాగతించిన యూఏఈ, 2018లో 57,613 మంది వ్యక్తులను నియమించుకోగా.. 2019లో 45,712 మంది భారతీయులను మాత్రమే నియమించుకుంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గణాంకాల ప్రకారం.. భారతదేశ వలస జనాభాలో దాదాపు 50 శాతం మంది గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలలో పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలోని భారతీయ జనాభాలో 70 శాతం మంది సెమీ-స్కిల్డ్,  నైపుణ్యం లేని కార్మికులే. ఇక 20 నుండి 23 శాతం మంది భారతీయ నిపుణులు డాక్టర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, బ్యాంకర్లు వంటి 'వైట్ కాలర్' ఉద్యోగాల్లో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com