కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

- February 10, 2023 , by Maagulf
కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం  బంజారాహిల్స్ డివిజన్ 93 ఎన్.బి.టి నగర్ బస్తీ దవాఖానాలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కంటి వెలుగు కార్యక్రమంలో ఖైరతాబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్, డాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అందత్వ నివారణ కు ప్రతి సంవత్సరం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కంటి వెలుగు పై బస్తీలలో అవగాహన కల్పించేందుకు డాక్టర్లు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని బస్తీ దవాఖానాలలో కుటుంబ సభ్యులందరూ సందర్శించి ఐ స్క్రీనింగ్ చేసుకొని తగిన జాగ్రత్తలను పాటించాలని తెలిపారు. ఐ స్క్రీనింగ్ లో భాగంగా ప్రజలకు రీడింగ్  అద్దాలను ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. అంతే కాకుండా 40 సంవత్సరాల లోపు, ఆ పై వారికి ప్రిస్కిప్షన్ అద్దాలు వారం రోజుల్లోనే అందిస్తున్నారని తెలిపారు. కంటి సమస్యలు లేనివారు కూడా సందర్శిస్తున్నారని, ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించాలని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చే వారు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును తీసుకొని రావాలని తెలిపారు. బస్తీ దవాఖానాలో వృద్ధులు తమ కంటి సమస్యలను పరీక్షించుకొని వైద్యుల సలహాలను పాటించాలని తెలిపారు.

ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ రజినికాంత్ రెడ్డి, వైద్యులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్, సేవా ఫౌండేషన్ యూత్ ప్రెసిడెంట్ మహమ్మద్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com