బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్

- February 10, 2023 , by Maagulf
బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్

హైదరాబాద్: బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడిన అజయ్ కుమార్, వయసు 32 సంవత్సరాల వ్యక్తి ప్రాణాపాయస్థితికి జారుకున్నాడు. తాన ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి, పని నిమిత్తం వేరే ఆఫీస్ కి వెళ్లగా అకస్మాత్తుగా అపస్మారకస్థితిలోకి వెళ్లడమే కాకుండా మూర్ఛ కూడా వచ్చింది మరియు ఎడమ పక్క పరలైసిస్ అవ్వడం జరిగింది.వెంటనే తన సహోద్యోగులు హుటాహుటిన బేగంపేట్ లోని మెడికవర్ హాస్పిటల్స్ కి తీసుకొని వచ్చారు.MRI స్కాన్ లో తనకి మెదడులో చిన్న రక్తపు  గడ్డ ఉన్నట్లు గుర్తించారు మరియు అది మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ యొక్క పూర్తి అడ్డంకిని వెల్లడిస్తుంది. వెంటనే చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ రణధీర్ కుమార్ గారు సర్జరీ అవసరంలేకుండానే మినిమల్లి ఇన్వేసివ్  పద్దతిలో స్టెంట్ (కాథెటర్ సక్షన్ మరియు స్టెంట్ రిట్రీవర్‌లను ఉపయోగించి మెకానికల్ థ్రోంబెక్టమీ) చేసి రోగిని కాపాడారు.  

ఈ సందర్భంగా డాక్టర్ రణధీర్ కుమార్ మాట్లాడుతూ ". తీవ్రమైన స్ట్రోక్ అనేది సెరెబ్రోవాస్కులర్ ఎమర్జెన్సీ. దీని కారణంగా మెదడుకు రక్త సరఫరాలో ఆకస్మిక అంతరాయం కలుగుతుంది.స్ట్రోక్ యొక్క లక్షణాలు ముఖం, చేయి, కాలు మరియు మాట్లాడటంలో అకస్మాత్తుగా బలహీనత కలిగి ఉంటాయి. స్ట్రోక్‌కు ప్రమాద కారకాలు మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, ధూమపానం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 మిలియన్ కంటే ఎక్కువ తీవ్రమైన స్ట్రోక్ కేసులు ఉన్నాయి. తీవ్రమైన స్ట్రోక్ చికిత్సలో సమయం అనేది మెదడు కీలకమైన అంశం. తీవ్రమైన స్ట్రోక్ చికిత్స సమయంపై ఆధారపడి ఉంటుంది, 1 గంట నుండి 3 గంటల విండో పీరియడ్ ఇంట్రావీనస్ tPA (టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ లేదా సింపుల్ క్లాట్ బస్టర్ మెడిసిన్)తో థ్రాంబోసిస్‌కు అనుకూలంగా ఉంటుంది, 3 గంటలకు మించి క్లాట్ బస్టర్ ఔషధం యొక్క పరిమిత పాత్ర ఉంది. మెకానికల్ థ్రోంబెక్టమీ అనేది యాంటీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్‌లో 6 గంటల వరకు మరియు పృష్ఠ ప్రసరణలో మంచి ఫలితాలతో 12 గంటల వరకు తీవ్రమైన స్ట్రోక్‌కు సరైన సమయం.ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పేషెంట్ ని గంట నుంచి మూడుగంటల లోపు  వ్యవధిలో హాస్పిటల్ కి తీసుకోని రాగలిగితే పేషెంట్ కి సర్జరీ అవసరం లేకుండా స్టంట్ వేసి కాపాడవచ్చు అని అన్నారు. 

మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్ కైలాసం మాట్లాడుతూ " అక్యూట్ బ్రెయిన్ ఎమర్జెన్సీని ప్రోటోకాల్ ఆధారిత చికిత్స ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చు.మెడికవర్ హాస్పిటల్స్ లో అన్ని రకాల స్ట్రోక్ ఆధారిత ప్రొటొకాల్స్ ని పాటిస్తూ అత్యవసర పరిస్థితులలో అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నామని అన్నారు.ఈ సందర్భంగా సమగ్రమైన స్ట్రోక్ సెంటర్ కలిగిన మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట లో ఇటువంటివి  సాధ్యం అన్నారు.

బేగంపేట్ మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ డాక్టర్ హృషీకేశ్ మాట్లాడుతూ , బేగంపేట్ లోని మెడికవర్ హాస్పిటల్స్ లో అత్యుత్తమ వైద్య నిపుణులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని , ఎమర్జెన్సీ ఏ  సమయంలో వచ్చినా మా నిష్ణాతులైన వైద్యబృందం వెంటనే సత్వరమైన చికిత్స అందిస్తుందని అన్నారు. అత్యంత ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తికి అత్యాధునిక వైద్యం అందించి బ్రెయిన్ స్టెంట్ వేసి కాపాడడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ రణధీర్ కుమార్ చీఫ్ న్యూరోసర్జన్, మెడికల్ డైరెక్టర్ సతీష్ కైలాసం,డాక్టర్ గౌసుద్దీన్ న్యూరోఫిజిషియన్, సెంటర్ హెడ్ హృషీకేశ్, డాక్టర్ భార్ఘవ్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com