ఒపెక్ క్రూడ్ ప్రొడక్షన్ పెంపుతో చమురు ధరల పతనం
- May 02, 2016
ఒపెక్ దేశాల్లో క్రూడ్ ప్రొడక్షన్ పెరుగుతుండడంతో చమురు ధరలు పతనమవుతున్నాయి. డాలర్ విలువ గత కొన్నాళ్ళుగా తగ్గుతుండడంతో డాలర్ ద్వారా ట్రేడింగ్ జరుపుతున్న దేశాలు క్రూడ్ ఆయిల్ కోసం మరింతగా ముందుకొస్తున్నాయి. దీంతో, డిమాండ్‌ని అందుకునేందుకు ఒపెక్ దేశాలు క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్‌ని విపరీతంగా పెంచాయి. ఈ ప్రభావంతో సోమవారం మార్కెట్లో ఆయిల్ ధరలు బాగా తగ్గాయి. బ్రెంట్ చమురు 46.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది 47 సెంట్స్ తక్కువ. యూఎస్ క్రూడ్ 33 సెంట్లు తగ్గి 45.58 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్చ్‌లో రోజుకు 32.47 మిలియన్ బ్యారెల్స్ చమురు వెలికి తీత ఒపెక్ దేశాల్లో ఉంటే అది, 32.65కి చేరింది. రష్యా 3.117 మిలియన్ బిపిడికి తమ ఎగుమతుల్ని చేర్చింది. ఇది మార్చ్ 2.903గా ఉంది. భవిష్యత్తులో ఇది క్రూడ్ ఆయిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







