జ్వర నివారణకు ఆయుర్వేదం

- May 02, 2016 , by Maagulf
జ్వర నివారణకు ఆయుర్వేదం

ఆయుర్వేద శాస్త్రంలో జ్వరోపచర్యలను కారణాన్ని అనుసరించి సూచించారు. ఇలాంటి వాటిని 'హేతు విపరీత చర్యలు' అంటారు. జ్వర ప్రతిచర్యల ఫలితాలు అనేక విషయాలు మీద ఆధారపడి ఉంటాయి. ఆయా వ్యక్తుల తాలూకు ప్రాంతీయత (దేశం), శరీరంలో ఉండే దోష ప్రాబల్యం (దూష్యం), శారీరక శక్తి సామర్ధ్యాలు (బలం), రుతువుల ప్రభావం (కాలం), జీర్ణశక్తి (అనలం), శరీరపు తీరు తెన్నులు (దేహప్రకృతి), వయసు - వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని చికిత్సను రూపొందించాల్సి ఉంటుంది. అంతేకాక, సామాన్య కారణాలను అనుసరించి చేయాల్సిన సాధారణ చికిత్సలను కూడా చేయాల్సి ఉంటుంది. అసంఖ్యాకంగా ఉన్న ఇటువంటి ఔషధ చికిత్సలనుంచి జనసామాన్యానికి అందుబాటులో ఉండే కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాము.
.. జ్వరం కనిపించడానికి ముందు ప్రతివారికి సూచన ప్రాయంగా దాని లక్ష ణాలు అనుభవమవుతుంటాయి. అలాంటి వాటిని 'పూర్వరూపాలు' అం టారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నాలుక మందంగా తయారవడం, బడలిక మొద లైన వాటిని పూర్వ రూపాలుగా భావించాలి. దీనికి 'లఘ్వశనం' సరైన చికిత్స. లఘువుగా లేదా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడమే లఘ్వశనం జ్వర ప్రాదుర్భావం అమాశయం నుంచి మొదలవుతుంది. కాబట్టి జ్వరంలో ఆకలిమీద మొదటి వేటు పడుతుంది. అందుకే జ్వరంలో తీసుకునే ప్రతి చర్యా ఆకలిని రక్షించే విధంగా, లేదా వీలైతే పెంచే విధంగా ఉండాలి, లఘు భోజనం అందుకు ఉపకరిస్తుంది. లంఘన చికిత్సలో లఘు భోజనంతోపాటు ఆహారం తేలికగా జీర్ణమవడం కోసం పాచన ఔషధాలను కూడా ప్రయోగించాల్సి ఉంటుంది.వేడినీళ్లు తాగాలి: జ్వరంలో ఉష్ణ జల పానాన్ని ఆయుర్వేదం ప్రముఖంగా చెప్పింది, ముఖ్యంగా కొత్తగా వచ్చిన జ్వరాన్ని తగ్గించడంలో వేడినీళ్లు ప్రధాన పాత్ర పోషి స్తాయి. వేడినీళ్ల వలన ఆకలి పెరుగుతుంది. బద్ధకం, బడలిక తదితరాలు దూరమ వుతాయి. వేడినీళ్లను ఎలాపడితే అలా తాగకూడదు, దీనికొక పధ్ధతి ఉంది. నీళ్లను శుభ్రమైన పాత్రలో తీసుకొని సగం మిగిలే వరకు మరిగించి తాగాలి. ఒకసారి కాచిన నీళ్లను మళ్లీమళ్లీ మరిగించి తాగకూడదు.షడంగ పానీయం: జ్వరంలో ఈ పానీయం అద్భుతంగా పనిచేస్తుంది. తుంగ ముస్తలు, పర్పాటకం, వట్టి వేర్ల్లు, చందనం, కురువేరు, శొంఠి ఈ ద్రవ్యాలను షడంగాలంటారు. ఇవి దినుసులు అమ్మే దుకాణాలలో లభ్యమవుతాయి. ఈ ద్రవ్యాలను అన్నిటిని సమాన భాగాలుగా తీసుకుని వాటిని 64 రెట్లు నీళ్లు పోసి సగభాగం మిగిలే వరకు కాచాలి. తరువాత మూత పెట్టి చల్లార్చాలి. దీనిని వడపో సుకుని ఏ పూటకాపూట తాగితే చక్కని ఫలితం కనిపిస్తుంది. దీని వలన మూత్రం జారీ అవడమే కాకుండా చమట పట్టి జ్వరం ఉపశమిస్తుంది. ఈ పానీయానికి శొంఠి కలిపితే జీర్ణ శక్తి మెరుగవుతుంది.జావ తాగడం మంచిది: మీరు తినే ఆహారం బియ్యం, గోధుమలు, జొన్నలు... ఇటువంటిది ఏదైనా కానీయండి, దీనిని రవ్వలాగా మరపట్టించి, దోరగా వేయించి, నీళ్లతో కలిపి జావలాగా చేసుకొని తాగితే తేలికగా జీర్ణమవుతుంది. అయుర్వేదం ఇటువంటి ఆహారాన్ని 'యవాగు' అంటుంది. వేయించడం వలన దానిని జీర్ణం చేసుకోవడానికి అదనపు జీర్ణశక్తిని వెచ్చించాల్సిన అవసరం రాదు. అలాగె, ద్రవ యుక్తంగా ఉంటుంది కనుక దప్పికను తీరుస్తుంది. వేడిగా ఉంటుంది కనుక చమటను పుట్టించి జ్వరం దిగేలా చేస్తుంది. మరీ నీళ్లు మాదిరిగా కాకుండా ఘనా హారంతో కలిసి ఉంటుంది. కనుక శరీరానికి బలాన్నీ, శక్తినీ ఇస్తుంది. అలాగే మలాన్నీ, వాయువును బహిర్గత పరుస్తుంది. యవాగులో రుచికోసం కొద్దిగా శొం ఠిని, సైంధవ లవణాన్ని చేర్చి తీసుకోవచ్చు. వీటి వలన దీని గుణాలు ద్విగుణీకృతమవుతాయి.ఫలరసాలు: జ్వరంతో ఒళ్లు వేడిగా తయారైనప్పుడు శరీరం చల్లబడటం కోసం చమట పుడుతుంది. ఇలా మరీ ఎక్కువసేపు జరిగితే శరీరం లోపల మిగిలి ఉన్న నీటిని కాపాడుకోవడం కోసం స్వేదరంధ్రాలు మూసుకుపోతాయి. దీనితో జ్వరం మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే సమృద్ధిగా ద్రవాహారాలను, పండ్లరసాలను తీసుకోవాలి. ఒకవేళ ఫలరసాలను తీసుకోవడం వెగటుగా అనిపిస్తే కాస్త ఐస్ ను చేర్చి తీసుకోవచ్చు, పిల్లలు పండ్లరసాలను తీసుకోకుండా మారాం చేస్తుంటే, వాటిని డీప్ ఫ్రిజ్‌లో గడ్డకట్టించి, 'ఇస్ ఫ్రూట్' లాగా చేసి ఇవ్వవచ్చు.శీతలోపచారాలు: జ్వరం 103 డిగ్రీల ఫారిన్ హీట్‌ను మించుతున్నప్పుడు శీతలోపచారాలు చేపట్టడం ముఖ్యం. తడి బట్టనుకాని, స్పాంజ్ ను గాని నీళ్లలో ముంచి గట్టిగా పిండి ఒళ్లంతా తుడవాలి. చంకలు, గజ్జలు మొదలైన భాగాలలో వేడి కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలను ప్రత్యేక శ్రద్ధతో తుడవాలి.దుప్పట్లను అవసరానుసారం వాడాలి: జ్వరంగా ఉన్నంత మాత్రాన దుప్పటి కప్పుకోకూడదు. కేవలం చలిగా ఉన్నప్పుడు మాత్రం కప్పుకుంటే సరిపోతుంది. ఒళ్లు జ్వరంతో కాలిపోతున్నప్పుడు దుప్పటిని తొలగించడం, చలికి వణికిపోతున్నప్పుడు కప్పుకోవడం మార్చి మార్చి చేస్తుంటే త్వరగా జ్వరం నుంచి సాంత్వన లభిస్తుంది.జ్వర చికిత్స: జ్వరాన్ని తగ్గించే ఔషధాలలో కొన్ని ఉష్నోత్పాదక కేంద్రం గరిష్ట స్థాయిని తగ్గిస్తే మరికొన్ని జ్వర కారకాలపై దాడి చేస్తాయి. కొన్ని ఔషధాలు దోషాలను పాచనం చేస్తే మరికొన్ని స్వేదాన్ని అధికం చేయడం ద్వారా జ్వరాన్ని తగ్గిస్తాయి. మరికొన్ని ఔషధాలు కేవలం తమ ప్రభావం చేతనే జ్వరాన్ని తగ్గించగలుగుతాయి. ఉదాహరణకు వత్సనాభి, కర్పూరం, తులసి, మద్యం, పర్పాటకం, చేదు పోట్ల, తిప్పతీగ, ఇవన్నీ మస్తిష్కంలోని ఉష్ణోత్పాదక కేంద్రంమీద పనిచేసి జ్వరాన్ని తగ్గిస్తాయి.బాష్పస్వేదం, దూపనం, పెన్నేరుగడ్డ, చేదుబాదం, పోక, ఉమ్మెత్త, జిల్లేడు, అటుకుమామిడి, ఉలవలు, వేడినీళ్లు, ఇవన్నీ స్వేదాన్ని పుట్టించడం ద్వారా జ్వరాన్ని తగ్గించగలుగుతాము. తాళకం, క్వినైన్, మల్లసింధూరం వంటి ఔషధాలు కీటాణు నాశకాలుగా పనిచేసి సూక్ష్మజీవుల విషలక్షణాలను అరికడతాయి.జ్వరాలను వివిధ రకాలుగా వర్గీకరించి వాటికి అనుగుణంగా ఔషధాలను ప్రయోగించాల్సి ఉంటుంది. సుదర్శన చూర్ణం, జ్వరభైరవ రసం, గోదన్తీ భస్మం, మౄఎత్యుంజయ రసం వంటి అనేకానేక ఔషధాలను జ్వర హరాలుగా వాడవచ్చు. దీనికి ముందు సరైన వైద్య సలహా తీసుకుని వీటిని వాడితే చక్కని ఫలితం ఉంటుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com