భారత వ్యక్తిని పొడిచి చంపిన పాకిస్తానీ..
- February 15, 2023
షార్జా: షార్జాలో ఘోరం జరిగింది.భారత వ్యక్తిని ఓ పాకిస్తానీ కత్తితో పొడిచి చంపేశాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన షార్జా పోలీసులు గంటల వ్యవధిలోనే హంతకుడైన పాకిస్తాన్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భారతీయుడికి, పాకిస్తానీకి మధ్య చోటు చేసుకున్న చిన్న ఘర్షణ కాస్త ఇలా ఒకరి మృతికి కారణమైందని పోలీసులు వెల్లడించారు. షార్జా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షార్జాలోని బు తినా అనే ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి 12.30గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. భారత వ్యక్తి స్థానికంగా ఉండే ఓ హైపర్ మార్కెట్లో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఓ పాకిస్తానీ చిన్న విషయమై భారత ప్రవాసుడితో వాగ్వాదానికి దిగాడు. అది కాస్త హింసాత్మకంగా మారింది.
పాక్ వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తితో భారతీయుడిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ భారత వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలాడు. అనంతరం పాకిస్తానీ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న భారతీయుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇక ఇదే ఘటనలో మరో పాకిస్తానీతో పాటు ఈజిప్టియన్ కూడా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం అల్ కువైటీ ఆస్పత్రికి తరలించారు. వారు ఇచ్చిన సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. అనంతరం తదుపరి విచారణ కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. కాగా, మృతుడిని కేరళ రాష్ట్రం పలాక్కడ్ జిల్లాలోని మన్నార్క్కడ్కు చెందిన హక్కీంగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







