హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం

- February 15, 2023 , by Maagulf
హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం

హైదరాబాద్: హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నగరంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్ లోని ఓ కూలర్ గోదాంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది.

అగ్నిప్రమాదం ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం తెలుసుకున్నఅగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com