ఖతీఫ్ రన్ ఓవర్ ఘటనలో దోషులకు 15 ఏళ్ల జైలుశిక్ష
- February 16, 2023
సౌదీ: తూర్పు ప్రావిన్స్‌లోని ఖతీఫ్ గవర్నరేట్‌లోని 2022 డిసెంబర్లో జరిగిన రన్-ఓవర్ దోపిడీ సంఘటనలో దోషులుగా తేలిన ఇద్దరు సౌదీ పౌరులకు ఒక్కోక్కరికి 15 ఏళ్ల జైలుశిక్షను సౌదీ కోర్టు శిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితులు తమ కారుతో ఓ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు. అనంతరం కారునుంచి దిగిన నిందితులు సదరు బాధితుడి దగ్గర ఉన్న విలువైన వస్తువులు, నగదును తీసుకొని సంఘటన ప్రాంతం నుంచి పరారు అయ్యారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారిపై హత్యాయత్నం, దోపిడీకి సంబంధించిన సెక్షన్ల కింద కేసులను నమోదు చేసిన పబ్లిక్ ప్రాసిక్యూషన్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టుకు రిఫర్ చేసింది. దుండగుల దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







