ఖతార్‌ - యూఏఈ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం

- May 03, 2016 , by Maagulf
ఖతార్‌ - యూఏఈ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం

ఖతార్‌ - యూఏఈ పలు అంశాలపై ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్యా వివిధ విభాగాల్లో సహాయ సహకారాలు పరస్పరం అందించుకునేందుకు ఈ ఒప్పందాలు మార్గం సుగమం చేస్తున్నాయి. ఖతార్‌ ఫారిన్‌ మినిస్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ అల్‌ థని మరియు యూఏఈ మినిస్టర్‌ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ షేక్‌ అబ్దుల్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇంకో వైపున ఖతార్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ మరియు దుబాయ్‌ ఎక్స్‌పోర్ట్‌ కలిసి ఎంఓయూపై సంతకాలు చేశాయి. క్యుడిబి సీఈఓ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ నాజర్‌ అల్‌ ఖలీఫా, దుబాయ్‌ ఎక్స్‌పోర్ట్‌ సయీద్‌ అవాది ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్యా ట్రేడ్‌ బ్యాలెన్స్‌ 6 నుంచి 7 బిలియన్లకు చేరుకుందని యూఏఈ మినిస్టర్‌ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ వెల్లడించారు. ఖతార్‌లో 1,074 కంపెనీలు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. యూఏఈలో పనిచేస్తున్న ఖతారీ కంపెనీల సంఖ్య 4,200. ఇరు దేశాల మధ్యా వ్యూహాత్మక సంబంధాలు ఇంకా మెరుగుపడవలసి ఉందని ఇరువురూ అభిప్రాయపడ్డారు. ఖతార్‌లో పర్యటించే ఎమిరేట్‌ విజిటర్స్‌ సంఖ్య 117,000 కాగా, యూఏఈలో పర్యటించే ఖతారీ విజిటర్స్‌ సంఖ్య 231,000.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com