దుబాయ్ టాప్ గమ్యస్థానంగా భారత్.. 9.8 మిలియన్ల ప్రయాణికులతో రికార్డు
- February 21, 2023
యూఏఈ: ప్రయాణీకుల రద్దీ పరంగా 2022లో దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) విమానాశ్రయానికి భారతదేశం టాప్ గమ్యస్థానంగా నిలిచింది. మంగళవారం దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ విడుదల చేసిన వార్షిక గణాంకాల ప్రకారం.. గత ఏడాది భారతదేశం నుండి 9.8 మిలియన్ల మంది ప్రయాణికులు దుబాయ్‌కి ప్రయాణించారు. ఇది ఏ గమ్యస్థానం నుండి అయినా అత్యధికం కావడం గమనార్హం. భారతదేశం తర్వాత సౌదీ అరేబియా (4.9మీ), యూకే (4.6మీ), పాకిస్థాన్ (3.7మీ), అమెరికా (3మీ), రష్యా (1.9మీ), టర్కీ (1.6మీ)లు ఉన్నాయి.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం 99 దేశాల్లోని 229 గమ్యస్థానాలకు 88 కంటే ఎక్కువ అంతర్జాతీయ క్యారియర్లను నడుపుతోంది. దుబాయ్ ఎకానమీ, పర్యాటక శాఖ ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. 2022లో 14.36 మిలియన్ల సందర్శకులు దుబాయ్ ని సందర్శించారు. గతేడాదితో పోల్చితో ఇది 97 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత సంవత్సరం భారతదేశం, సౌదీ అరేబియా, యూకే, పాకిస్తాన్ నుండి దుబాయ్ సందర్శించిన పర్యాటకుల సంఖ్య వరుసగా 1.84 మిలియన్లు, 1.21 మిలియన్లు, 1.04 మిలియన్లు, 356,000 గా ఉంది.
దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్ ఎమిరేట్ టూరిజం ఆఫర్‌ను 100 శాతానికి పైగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2031 నాటికి 40 మిలియన్ల మంది అతిథులను ఆకర్షించడానికి, ఎమిరేట్ GDPకి పర్యాటక రంగం సహకారాన్ని Dh450 బిలియన్లకు పెంచడానికి యూఏఈ టూరిజం స్ట్రాటజీకి అనుగుణంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించనుంది. దుబాయ్ నగరం ఇటీవలే ట్రిప్యాడ్వైజర్ ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డ్స్ 2023లో నంబర్ 1 గ్లోబల్ డెస్టినేషన్‌గా ర్యాంక్ పొందింది. దుబాయ్ వరుసగా రెండవ సంవత్సరం అగ్ర స్థానాన్ని గెలుచుకుంది. చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండవ నగరంగా దుబాయ్ నిలిచింది.
దుబాయ్ పర్యాటక రంగ వృద్ధిని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలను ఆవిష్కరిస్తూనే ఉంది. సెప్టెంబర్ 2022 నుండి 60 రోజుల టూరిస్ట్ వీసా అందుబాటులోకి తెచ్చింది. బహుళజాతి కంపెనీల ఉద్యోగులకు ఐదేళ్ల మల్టీ-ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. అలాగే 10-సంవత్సరాల గోల్డెన్ వీసా రెసిడెన్సీ స్కీమ్, వర్చువల్ వర్క్ కోసం అనుమతులు తదితర స్కీంలు పర్యాటకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులను ఆకర్షిస్తున్నాయి.
నగరాల పరంగా 2022లో దుబాయ్ విమానాశ్రయానికి మూడు మిలియన్ల మంది ప్రయాణికులతో లండన్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రియాద్ (2 మిలియన్లు), ముంబై (1.9 మిలియన్లు), జెడ్డా న్యూఢిల్లీ రెండూ 1.7 మిలియన్ల ప్రయాణికులతో ఉన్నాయి. జనవరి 2023లో ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు దుబాయ్ అగ్ర గమ్యస్థానంగా ఉందని భారత విమానాశ్రయం తన నెలవారీ డేటాలో తెలిపింది. మొత్తంగా 2022లో DXB ప్యాసింజర్ ట్రాఫిక్ రెండింతలు పెరిగి 66 మిలియన్లకు పైగా పెరిగింది. ఈ నేపథ్యంలో 2023లో ప్రయాణికుల అంచనాను 78 మిలియన్లకు పెంచింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..