ఇరాన్ భూకంపంతో ఖతార్‌కు ముప్పు లేదు: అథారిటీ
- February 21, 2023
దోహా: నైరుతి ఇరాన్‌లో మంగళవారం సంభవించిన భూకంపం కారణంగా ఖతార్ రాష్ట్రానికి ఎలాంటి ప్రమాదం లేదని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) ప్రకటించింది. సివిల్ ఏవియేషన్ అథారిటీకి అనుబంధంగా ఉన్న ఖతార్ సీస్మిక్ నెట్‌వర్క్‌లోని అధికారి ఇబ్రహీం ఖలీల్ అల్ యూసఫ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఉన్న అరేబియన్ ప్లేట్, ఇరానీయన్ ప్లేట్ కారణంగా జాగ్రోస్ పర్వతాల వెంబడి భూకంపాలు సంభవిస్తాయని వివరించారు. నైరుతి ఇరాన్‌లో 5.3-తీవ్రతతో సంభవించిన భూకంపం తరువాత ఖతార్ రాష్ట్రం లోపల సంభవించిన ప్రకంపనలు స్పల్పంగా ఉన్నాయని, వాటితో ప్రమాదం లేదని అల్ యూసఫ్ తెలిపారు. ఉదయం 9:05 గంటలకు (దోహా సమయం) ఇరాన్‌కు నైరుతి దిశలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఖతార్ సీస్మిక్ నెట్‌వర్క్ నమోదు చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..