ఎప్పుడూ హ్యాపీ గా ఉండడం కుదురుతుందా?
- February 22, 2023
నమస్తే మేడం,
నేను ఇప్పుడు కాలేజీ లో చదువుతున్నాను. గత కొన్ని నెలలుగా పాజిటివ్ థింకింగ్ మీద పుస్తకాలు చదువుతున్నాను. ఇంస్టాగ్రామ్ లో కూడా ఎక్కువ ఇలాంటి పోస్ట్స్ నే ఫాలో అవుతున్నా. కానీ కొన్ని సార్లు పాజిటివ్ గా ఆలోచించటం నా వల్ల అవ్వటం లేదు. ఎప్పుడూ సంతోషం గా ఉండాలి అని అంటారు కదా. ఎలాంటి సందర్భంలో అయినా సానుకూల దృక్పధం కావాలి అంటారు కదా నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను? ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి అంటే ఇంకా ఏమి చెయ్యాలి.
నమస్తే,
మొదటగా 'అల్ ఈజ్ వెల్' , 'డోంట్ వర్రీ బీ హ్యాపీ' లాంటి స్టేటుమెంట్లు అన్ని సందర్భాల్లో సరిపోవు. ఎప్పుడూ ఇలా ఆలోచించటం వల్ల మరింత స్ట్రెస్ కి లోనవుతున్నారు మీరు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి కి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి అని గుర్తించండి. కోపం, బాధ, నిరాశ వంటి నెగటివ్ ఎమోషన్స్ కూడా మన జీవితంలో సాధారణం. వాటిని కలిగి ఉంటడం తప్పేమి కాదు అని గుర్తించటం ముఖ్యం.
ముందుగా ఇలాంటి ఎమోషన్స్ ఎందుకు వచ్చాయో అని ఆలోచించండి. ఉదాహరణకి ఒక సంఘటన మిమ్మల్ని బాధించింది అనుకోండి. దేని వలన మీరు బాధ పడ్డారు అని ఆలోచించండి. వీలైతే ఎలాంటి మార్పులు చేసుకోగలరో అది చెయ్యడానికి ప్రయత్నం చేయండి.
మనకి ఎదురయ్యే ప్రతి అంశాన్ని పాజిటివ్ గాచూడాలి అని అనుకుని.. నెగటివ్ ఎమోషన్స్ ని అణచివేయడం ద్వారా నిజమైన ఆనందం రాదు. నెగటివ్ గా ఆలోచిస్తే నెగటివ్ ఎనర్జీ వస్తుంది అని అనుకోవటం కూడా తప్పు, అంటే మనకి మనమే నెగటివ్ ఎమోషన్స్ ( కోపం, బాధ, జెలసి, etc ) లాంటివి ఉండకూడదు అని అనుకోవటం వల్ల కూడా స్ట్రెస్ వస్తుంది.
మనకి ఉన్నదానికి ఎప్పుడు కృతజ్ఞత తో ఉండాలి అసలు అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అనుకోవటంలో తప్పేమి లేదు. కానీ అలా ఆలోచించి ఇప్పుడు మనం పడే కష్ఠాన్ని విస్మరించటం వల్ల కూడా స్ట్రెస్ వస్తుంది.
ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, అది ఏమి లేదు మనం నెగటివ్ గా ఆలోచిస్తున్నాం అంతే అనుకోవటం అన్ని సార్లు మంచిది కాదు. ఆలా అనుకుని జాప్యం చేయటం వల్ల కొన్నిఆరోగ్య సమస్యలు పెద్దగా అయ్యిపోవచ్చు. ఈ క్షణం లో ఏ ఎమోషన్ ఫీల్ అవుతున్నామో అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా, దాన్ని అంగీకరించ గలిగితే అప్పుడే నిజమైన ఆనందం దొరుకుతుంది.
--- ఉమాదేవి. వాడ్రేవు, సైకాలజీ కౌన్సిలర్
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!