మద్యం మత్తులో కెనాల్‌లోకి దూకిన వ్యక్తి.. Dh5,000 జరిమానా

- February 22, 2023 , by Maagulf
మద్యం మత్తులో కెనాల్‌లోకి దూకిన వ్యక్తి.. Dh5,000 జరిమానా

యూఏఈ: దుబాయ్ వాటర్ కెనాల్‌లో దూకిన 34 ఏళ్ల గల్ఫ్ దేశస్థుడిని మెరైన్ రెస్క్యూ పెట్రోల్ సిబ్బంది రక్షించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. మత్తు పదార్థాలు సేవించినట్లు తేలింది. క్రిమినల్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. ఫెడరల్ చట్టంలోని డ్రగ్ షెడ్యూల్ నంబర్ 5 అండ్ 8లో జాబితా చేయబడిన మత్తుపదార్థాలను ఆ వ్యక్తి ఉపయోగించినట్లు గుర్తించారు. విచారణలో అతను సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించినట్లు అంగీకరించినప్పటికీ, అతను కోర్టు ముందు తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించాడు. మానసిక వ్యాధికి చికిత్స చేయడానికే వాటిని తీసుకున్నానని, డ్రగ్స్ వాడడాన్ని సమర్థించుకున్నాడు. కాగా అతను ఈ వాదనను నిరూపించలేకపోయాడు. దీంతో అతన్ని కోర్టు దోషిగా నిర్ధారించి Dh5,000 జరిమానా విధించింది. అలాగే అతని బ్యాంకింగ్ కార్యాకలాపాలను దుబాయ్ మిస్డిమినర్, ఉల్లంఘనల కోర్టు రెండేళ్లపాటు నిషేధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com