ఢిల్లీ, చెన్నైలో భూప్రకంపనలు..
- February 22, 2023
ఢిల్లీ, చెన్నైలో ఇవాళ భూప్రకంపనలు సంభవించాయి. చెన్నైలోని అన్నా మౌంట్ రోడ్, ఈరోడ్, అన్నశాలై ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరి కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1.35 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.
అయితే, మెట్రో నిర్మాణ పనుల వల్ల ప్రకంపనలు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. మెట్రో అధికారులు మాత్రం ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం మెట్రో పనులు జరగడం లేదని చెప్పారు. మరోవైపు, నేపాల్ లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్ లోని జమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంపకేంద్రం ఉందని అధికారులు చెప్పారు.
భూప్రకంపనలు రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అలాగే, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్ లో భూకంప ప్రభావంతో ఉత్తర భారత్ లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పస్థాయి భూప్రకంపనలు సంభవించాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు