హైదరాబాద్ విమానాశ్రయం నుంచి నోక్ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం
- February 22, 2023
హైదరాబాద్: GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేడు బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తొలిసారిగా నోక్ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. భారతీయ మార్కెట్లోకి అడుగు పెట్టిన నోక్ ఎయిర్‌కు హైదరాబాద్ భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక గమ్యస్థానం.ప్రారంభ విమానం నేడు 00.40 గంటలకు (22 ఫిబ్రవరి), హైదరాబాద్ నుండి డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. కొత్త మార్గంలో నోక్ ఎయిర్ సర్వీసు 737మ్యాక్స్ 8 విమానాన్ని నడుపుతుంది.
నోక్ ఎయిర్ విమాన సర్వీసులు వారానికి మూడుసార్లు ఉంటాయి.నాన్‌స్టాప్ ఫ్లైట్ DD 958 హైదరాబాద్ విమానాశ్రయానికి రాత్రి 23.45 గంటలకు చేరుకుని, హైదరాబాద్ నుండి తిరిగి 00.45 గంటలకు బయలుదేరుతుంది.హైదరాబాద్ విమానాశ్రయం నుండి థాయ్‌లాండ్‌కు నేరుగా విమానాలు నడుపుతున్న రెండవ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇది. నోక్ ఎయిర్ డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి థాయ్‌లాండ్‌లోని అనేక పర్యాటక ప్రాంతాలను కలుపుతుంది. ప్రస్తుతం థాయ్ ఎయిర్ విమాన సర్వీసులు హైదరాబాద్ నుండి సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం, బ్యాంకాక్‌కు ప్రతీ రోజూ నడుస్తున్నాయి.
ప్రదీప్ పణికర్,CEO-GHIAL మాట్లాడుతూ, “భారతదేశంలో నోక్ ఎయిర్ సర్వీసులు మొదటగా మా విమానాశ్రయంతోనే ప్రారంభం కావడం మాకు గర్వకారణం.థాయ్‌లాండ్ భారతీయులకు అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. డైరెక్ట్ ఫ్లైట్ వల్ల బ్యాంకాక్ ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించడమే కాకుండా చియాంగ్ మాయి, బెటాంగ్, క్రాబీ, ఫుకెట్ మరియు మరెన్నో ఇతర గమ్యస్థానాలను అన్వేషించడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది. విమానాశ్రయ విస్తరణ త్వరలో పూర్తి కానున్నందున, అంతర్జాతీయ క్యారియర్లతో ప్రయాణికులకు మరిన్ని గమ్యస్థానాలకు సర్వీసులను ప్రారంభించడానికి, మరిన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు కనెక్టివిటీని పెంచడడంపై మేము దృష్టి పెడుతున్నాము.’’ అన్నారు.
నోక్ ఎయిర్, నోక్ ఎయిర్ లైన్స్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్ నిర్వహణలో బడ్జెట్ క్యారియర్.నోక్ ఎయిర్ విస్తృతమైన దేశీయ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది, బ్యాంకాక్ నుండి ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఫుకెట్, చియాంగ్ మాయ్, చియాంగ్ రాయ్‌లకు నేరుగా కనెక్షన్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు