మహేష్ సినిమాకి బాలీవుడ్ గ్లామర్.!

- February 22, 2023 , by Maagulf
మహేష్ సినిమాకి బాలీవుడ్ గ్లామర్.!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్ధే నటిస్తుండగా, మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది ‘ధమాకా’ భామ శ్రీలీల. 

కాగా, ఈ సినిమాకి మరింత గ్లామర్ అద్దేందుకు బాలీవుడ్ బొమ్మని దిగుమతి చేయనున్నారట. ఆమె ఎవరో కాదు, భూమి ఫడ్నేకర్. ‘ది టాయిలెట్’, ‘బదాయి దో’ తదితర చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు దక్కించుకున్న భూమి ఫడ్నేకర్‌ని ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

కొన్ని నిముషాల పాటు మాత్రమే ఈ పాత్ర వుంటుందట కానీ, ఆ కొద్ది సేపూ స్ర్కీన్‌పై ఫుల్ గ్లామర్‌తో నిండిపోనుందట. గ్లామర్ విత్ పవర్ అనేలా భూమి ఫడ్నేకర్ పాత్రని డిజైన్ చేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. చూడాలి మరి, భూమి ఈ పాత్రతో తెలుగు ప్రేక్షకుల్ని ఎలా మెస్మరైజ్ చేయనుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com