తారకరత్నకు అనిల్ రావిపూడి ఛాన్సిద్దామనుకున్నాడట.!
- February 22, 2023
లోకేష్ పాదయాత్రలో భాగంగా నందమూరి హీరో తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. మృత్యవుతో పోరాడి శివరాత్రి రోజున శివైక్యం పొందిన సంగతి తెలిసిందే. అయితే, తారకరత్న మరణించిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియచేశారు.. అదీ తెలిసిన సంగతే.
అసలు విషయమేంటంటే, జీవించి వున్నంతవరకూ తారకరత్నను ఎవ్వరూ పట్టించుకోలేదు. బాలయ్య తలచుకుంటే, తారకరత్నకు అవకాశాలు కరువా.? ఇప్పుడు బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రంలో ఓ మంచి ఛాన్సిద్దామనుకున్నారట.
ఆ విషయం తారకరత్న చనిపోయాకా, ఆ సినిమా దర్శకుడైన అనిల్ రావిపూడి స్వయంగా చెబుతున్నాడు. ఏం.! అనిల్ రావిపూడికి ఇన్నాళ్లూ తారకరత్న గుర్తుకు రాలేదా.? ఈ మాట అనిల్ ఇప్పుడు చెప్పి వుండకూడదని ఆయన అభిమానులే చీవాట్లు పెడుతున్నారు.
అనిల్ రావిపూడి మాత్రమే కాదు.. చాలా మంది సినీ ప్రముఖులు తారకరత్నతో సినిమా చేద్దామనుకున్నాం.. అంటూ ఈ సందర్భంగా తేలిక మాటలు మాట్లాడేస్తుండడం జనాలను విస్తుపోయేలా చేస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?