రమదాన్ 2023: పవిత్ర మాసంలో నాలుగు కీలక మార్పులు

- February 23, 2023 , by Maagulf
రమదాన్ 2023: పవిత్ర మాసంలో నాలుగు కీలక మార్పులు

యూఏఈ: పవిత్రమైన రంజాన్ నెలకు ఒక నెల కంటే తక్కువ సమయం ఉన్నందున, యూఏఈ నివాసితులు తమ దినచర్యలలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇస్లామిక్ క్యాలెండర్‌లో రంజాన్ 9వ నెల ఉపవాసం, దాతృత్వం, ఆధ్యాత్మిక సమయంగా పరిగణించబడుతుంది. యూఏఈలో ముస్లింలు, ముస్లిమేతరులు పాటించే వివిధ సంప్రదాయాలు, ఆచారాలతో కూడిన మత స్ఫూర్తి ఉంటుంది. తగ్గిన పని, పాఠశాల సమయాలు, సంస్థల నిర్వహణ వేళల్లో మార్పులు అలాగే చెల్లింపు పార్కింగ్ సమయాలలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రత్యేక, అర్థరాత్రి ప్రార్థనలు ఉంటాయి. నిద్ర వేళలలో మార్పులు ఉంటాయి. ఉద్యానవనాలు వాటి ప్రారంభ వేళలను మారుస్తారు. రమదాన్ రాత్రి మార్కెట్‌లు అలాగే 90 శాతం వరకు తగ్గింపులను అందించే విక్రయాలు, ప్రచారాలు ప్రారంభమవుతాయి. అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కానీ రమదాన్ సందర్భంగా జరిగే కొన్ని మార్పులు.

1. పని గంటల తగ్గింపు
జీతంలో కోత లేకుండా పని గంటలు సాధారణంగా రెండు గంటలు తగ్గించబడతాయి. ముస్లిమేతరులు కూడా ఈ తగ్గిన పనిగంటలకు అర్హులు.

2. పాఠశాల గంటలు తగ్గింపు
విద్యార్థులు పాఠశాలలో తగ్గిన గంటలను కూడా ఆనందిస్తారు. కొన్ని సంస్థలు తమ రమదాన్ సమయాలు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటాయని చెబుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 నుండి 11.30 వరకు. ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా PE పాఠాలలో ఉపవాసం ఉన్న విద్యార్థులకు మినహాయింపు ఉంటుంది. స్విమ్మింగ్ పాఠాలు రద్దు చేయబడతాయి. అయితే సంగీత పాఠాలు ఎక్కువగా థియరీ ఆధారితంగా మారతాయి. ఉపాధ్యాయులు హోంవర్క్, అసైన్‌మెంట్‌ల మొత్తాన్ని కూడా పరిమితం చేయాలని భావిస్తున్నారు. పాఠశాల క్యాంటీన్లు మూసివేయబడతాయి.  

3. వ్యాపార నిర్వహణ గంటలలో మార్పు
సూపర్ మార్కెట్లు,  కిరాణా దుకాణాలు యధావిధిగా తెరిచి ఉంటాయి. కొన్ని మాల్స్ అర్థరాత్రి వరకు తెరిచి ఉండవచ్చు. రెస్టారెంట్లు కూడా తెరిచి ఉంటాయి. కానీ చాలా మంది ఉపవాస సమయాలకు కట్టుబడి ఉంటారు. పగటిపూట మూసివేస్తారు. సాయంత్రం ప్రార్థనల తర్వాత మాత్రమే అవి తెరుచుకుంటాయి. రెస్టారెంట్లు రాత్రిపూట బిజీగా ఉంటాయి.సుహూర్ వరకు కార్యకలాపాలు కొనసాగుతాయి. పవిత్ర మాసంలో షాపింగ్ గమ్యస్థానాలు ఎక్కువ గంటలు తెరిచి ఉంటాయి. దేశవ్యాప్తంగా రాత్రి మార్కెట్లు ప్రారంభం అవుతాయి. యూఏఈలోని ప్రధాన రిటైలర్లు వివిధ ఉత్పత్తులపై 90 శాతం వరకు భారీ తగ్గింపులను అందిస్తారు.

4. పార్కింగ్ సమయాలు
రమదాన్ సందర్భంగా చెల్లింపు పార్కింగ్ గంటలు కూడా మారుతాయి. ఇంకా అధికారిక ప్రకటనలు లేనప్పటికీ, ఇవి గత సంవత్సరాల్లో చెల్లించిన పార్కింగ్ గంటల షెడ్యూల్: 

అబుధాబి: మవాకిఫ్ పార్కింగ్ ఫీజులు శనివారం నుండి గురువారం వరకు ఉదయం 8 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు వర్తిస్తాయి. శుక్రవారం మరియు ప్రభుత్వ సెలవు దినాలలో పార్కింగ్ ఉచితం.

దుబాయ్: పార్కింగ్ రుసుములు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు వర్తిస్తాయి. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 నుండి 12 అర్ధరాత్రి వరకు. ఆదివారం పార్కింగ్ ఉచితం. బహుళ అంతస్తుల పార్కింగ్ 24/7 చెల్లింపు సేవగా పనిచేస్తుంది.

షార్జా: పార్కింగ్ అనేది ఉదయం 8 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు చెల్లింపు సేవ. ఇది తరావీహ్ ప్రార్థనల సమయంలో మస్జీదుల చుట్టూ ఉచితం. శుక్రవారాలు, సెలవు దినాలలో చాలా జోన్లలో పార్కింగ్ ఉచితం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com