మస్కట్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం

- February 23, 2023 , by Maagulf
మస్కట్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం

మస్కట్: మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 27వ ఎడిషన్ ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC)లో ప్రారంభమైంది. ఒమన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ హమూద్ ఫైసల్ అల్ బుసాయిదీ ముఖ్య అతిథిగా హాజరై బుక్ ఫెయిర్ ను ప్రారంభించారు. అనంతరం ఫెయిర్ హాల్‌లను సందర్శించారు. సమాచార మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ, నేషనల్ రికార్డ్స్ అండ్ ఆర్కైవ్స్ అథారిటీ (NRAA), థాకెరత్ ఒమన్ సెంటర్‌తో సహా అధికారిక సంస్థలు, మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్, ఒమన్ విజన్ 2040 ఇంప్లిమెంటేషన్ ఫాలో-అప్ యూనిట్  పెవిలియన్‌లను సందర్శించారు.   

4 మార్చి 2023 వరకు జరిగే ఈ బుక్ ఫెయిర్‌లో 32 దేశాల నుండి 826 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. ఆ ప్రచురణ సంస్థలు 533,063 ప్రచురణలను సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. ఇందులో ఒమానీ ప్రచురణలు 22,950 ఉన్నాయి. అదే సమయంలో లేటెస్ట్ ప్రచురణలు 5,900 ఉండగా.. విదేశీ పుస్తకాలు 204,411 ఉన్నాయి. ఇక బుక్ ఫెయిర్ లో మొత్తం 260,614 అరబిక్ పుస్తకాలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. బుక్ ఫెయిర్‌లో పిల్లల కోసం 165 సాంస్కృతిక కార్యక్రమాలు, 166 వివిధ యాక్టివిటీస్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  మొట్టమొదటిసారిగా మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ స్థానిక బ్యాంకుతో సమన్వయంతో ఇ-చెల్లింపులను అమలు చేస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com