279 మంది సౌదీ మహిళా గ్రాడ్యుయేట్ల పాసింగ్ అవుట్ పరేడ్

- February 23, 2023 , by Maagulf
279 మంది సౌదీ మహిళా గ్రాడ్యుయేట్ల పాసింగ్ అవుట్ పరేడ్

రియాద్: పాస్‌పోర్ట్ ఇన్‌స్టిట్యూట్ నుంచి 279 మంది సౌదీ మహిళా రిక్రూటర్ల గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఇంటీరియర్ మినిస్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో జరిగి ఈ పాసింగ్ అవుట్ పరేడ్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) లెఫ్టినెంట్ జనరల్ సులైమాన్ అల్-యాహ్యా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ వేడుకలో ఐదవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ లో భాగంగా సౌదీ రిక్రూట్ గ్రాడ్యుయేట్లు సైనిక కవాతును ప్రదర్శించారు. సైనిక కవాతులో భాగంగా భద్రతా విభాగంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ వేడుకలో లెఫ్టినెంట్ జనరల్ అల్-యాహ్యా పాల్గొని రిక్రూట్ అయిన వారికి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ తరఫున శుభాకాంక్షలను తెలియజేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com