కుటుంబ వినోదానికి కేరాఫ్ బియాన్ మనీ F1 విలేజ్‌

- February 23, 2023 , by Maagulf
కుటుంబ వినోదానికి కేరాఫ్ బియాన్ మనీ F1 విలేజ్‌

 

బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC) "ది హోమ్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్ ఇన్ ది మిడిల్ ఈస్ట్" అడ్లియాలోని బ్లాక్ 338 వద్ద ఉన్న బియాన్ మనీ F1 విలేజ్‌ వారాంతంలో మొత్తం కుటుంబం కోసం విస్తృతమైన వినోదాన్ని ఆస్వాదించడానికి సాధారణ ప్రజలను ఆహ్వానిస్తోంది.  F1ని జరుపుకునే రెండు వారాల అభిమానుల పండుగ గత వారం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివస్తున్నారు. బహ్రెయిన్ రాజధాని నడిబొడ్డున F1 ఉత్సాహం కొనసాగుతుండడంతో ఈ శుక్రవారం, శనివారం మరింత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది.  ఈవెంట్ మార్చి 2 వరకు వారపు రోజులలో సాయంత్రం 6 నుండి 11 గంటల వరకు, వారాంతాల్లో మధ్యాహ్నం నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశం పూర్తిగా ఉచితం.

బియాన్ మనీ F1 విలేజ్‌లోని ముఖ్య ఆకర్షణలలో విస్తృత శ్రేణి F1-సంబంధిత కార్యకలాపాలు ఉన్నాయి. వీటిలో విస్తృతంగా జనాదరణ పొందిన F1 రేసింగ్ సిమ్యులేటర్‌లు, డిజిటల్ పెయింట్ మెషీన్‌తో మీ స్వంత F1 కార్ లివరీని డిజైన్ చేసే అవకాశం, డ్రైవర్ సెల్ఫీ అనుభవం,  F1 షో కార్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ ఉన్నాయి. ఇదిలా ఉండగా వారాంతం అంతా సందర్శకులను అలరించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వాటిలో కలర్‌ఫుల్ సూట్స్ మెన్, బద్రు ది మెజీషియన్, ఎల్టన్ సాక్సోఫోనిస్ట్ వంటి రోమింగ్ ఎంటర్‌టైనర్‌లు ఉన్నాయి. అన్నా సెలిస్ట్, కెమిలియో అరబిక్ బ్యాండ్, మానీ అండ్ ది బ్యాండ్, లాస్ కాబల్లెరోస్, హయత్, ది బ్యాండ్‌తో సహా సంగీతకారులు రోజంతా విలేజ్‌లో ప్రదర్శనలు ఉంటాయి. ఇక క్రాఫ్ట్ విలేజ్ పిల్లల కోసం ఫేస్ పెయింటింగ్, స్ట్రీట్ ఆర్టిస్టులు, BIC మర్చండైజ్, టికెటింగ్ స్టాండ్, బియాన్ మనీ స్టాండ్ యాక్టివేషన్, అన్ని రకాల వస్తువులను విక్రయించే వివిధ స్టాల్స్ కూడా ఉన్నాయి.

బియాన్ మనీ F1 విలేజ్ మార్చి 3 నుండి 5 వరకు సఖిర్‌లోని BICలో జరిగే F1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 చిన్న ప్రివ్యూను మాత్రమే అందిస్తోంది. రేస్ వారాంతం మూడు రోజుల టాప్-క్లాస్ మోటార్‌స్పోర్ట్‌ను కలిగి ఉంటుంది. స్టేజ్ షోలు, కార్నివాల్ రైడ్‌లు, పిల్లల కార్యకలాపాలు, DJ స్నేక్, క్రెయిగ్ డేవిడ్ కచేరీలు ప్రత్యేక ఆకర్షణలుగా నిల్వనున్నాయి.  BIC అధికారిక వెబ్‌సైట్ bahraingp.com లేదా +973-17-450000లో BIC హాట్‌లైన్‌కు కాల్ చేయడం ద్వారా టిక్కెట్‌లు, ఆతిథ్య ప్యాకేజీలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com