ఇండియన్ ఎంబసీలో ముగిసిన మిల్లెట్స్ వారోత్సవం

- February 23, 2023 , by Maagulf
ఇండియన్ ఎంబసీలో ముగిసిన మిల్లెట్స్ వారోత్సవం

కువైట్: భారత ప్రభుత్వ ప్రతిపాదనపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం (IYM 2023) ప్రకటించింది. మిల్లెట్ల ద్వారా పోషకాహారం అందించడం, ఆర్థికంగా వీటి వినియోగాన్ని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని యూఎన్ఎం ప్రకటించింది. భారత ప్రభుత్వం 2018ని జాతీయ మిల్లెట్ సంవత్సరంగా జరుపుకుంది. చిరు ధ్యాన్యాలను ప్రజా ఉద్యమంగా మార్చాలనే సంకల్పంతో, భారత ప్రభుత్వం IYOM 2023 వేడుకలకు నాయకత్వం వహిస్తోంది.

కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 15 నుండి 21 వరకు మిల్లెట్స్ వీక్ (IYOM 2023)ను నిర్వహించింది. కువైట్‌లో మిల్లెట్స్ వీక్ ముగింపు సందర్భంగా ఎంబసీ ఫిబ్రవరి 21న  ఎంబసీ ఆడిటోరియంలో “మిల్లెట్స్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్” పేరుతో ఫైనల్ ఈవెంట్‌ను నిర్వహించింది. అండర్ సెక్రటరీ అమిరి దివాన్ హీజ్ హైనస్ మాజెన్ ఎస్సా అల్-ఎస్సా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వివిధ దేశాల రాయబారులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, భారతీయ సంఘం సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కువైట్ లో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మాట్లాడుతూ.. జాతీయ, విమోచన దినోత్సవం సందర్భంగా కువైట్ రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGలు) సాధించడంలో మిల్లెట్ ప్రాముఖ్యతను వివరించారు. చిరుధాన్యాల ప్రయోజనాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంపై భారతదేశం ప్రాధాన్యతను ప్రస్తావించారు.  భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే మిల్లెట్ల వైవిధ్యాన్ని ప్రదర్శించే మిల్లెట్స్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఆర్ట్ విత్ మిల్లెట్స్ ఎగ్జిబిషన్‌లో సస్టైనబుల్ డెవలప్‌మెంట్, మిల్లెట్ ఫర్ టేస్ట్ అండ్ న్యూట్రిషన్,  ఇండియా-కువైట్ స్నేహం అనే ఇతివృత్తాలపై భారతీయ పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన 70కి పైగా కళాఖండాలను ప్రదర్శించారు.

ప్రఖ్యాత భారతీయ చెఫ్ ఛాయా ఠక్కర్చే మిల్లెట్స్ వంటకాల ప్రాంతీయ వైవిధ్యంపై ప్రత్యక్ష ప్రదర్శన జరిగింది. కువైట్‌లోని లులు హైపర్‌మార్కెట్లు, కువైట్‌లోని అల్-హకిమి సూపర్‌మార్కెట్ ద్వారా భారతీయ రాష్ట్రాల నుండి వివిధ మిల్లెట్‌లు, వాటి ప్రయోజనాల ప్రదర్శన కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.  ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ (IDF) సభ్యులు ప్రదర్శించిన భారతదేశంలో మిల్లెట్ సంస్కృతిపై స్కిట్‌తో పాటు భారతీయ సంఘం సభ్యులు, విద్యార్థులు చేసిన పంట నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.  అనంతరం మిల్లెట్స్ వీక్ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com