12 మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి : ఢిల్లీ
- May 03, 2016
అనుమానిత ఉగ్రవాదుల్ని దిల్లీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చన్న సమాచారంతో దిల్లీ స్పెషల్ బ్రాంచి పోలీసులు దేశ రాజధానిలో విస్తృంతంగా తనిఖీలు నిర్వహించి 12 మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడి విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.దిల్లీలో దాడులకు పాల్పడేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం రావడంతో దిల్లీ అంతటా విస్త్రతంగా తనిఖీలుచేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు 8 మంది పట్టుబడినట్లు పేర్కొన్నారు. వీరి నుంచి బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







