చూపులేని వారికోసం ఫేస్‌బుక్ సరికొత్త సదుపాయం
- May 03, 2016
చూపులేని వారికోసం సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. స్నేహితులు పోస్ట్ చేసిన ఫొటోలు.. వీడియోల పూర్తి వివరాలను మాటల్లో చెప్పే ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఫొటోలు.. వీడియోలను చూడాలంటే చూపులేని వారికి సాధ్యపడదు. ఇంతకుముందు అయితే కేవలం టైంలైన్‌పై ఎవరు పోస్టు చేశారు..? వాళ్లు ఫొటో షేర్ చేశారా.. మరేదైనా పంపారా అనేది మాత్రమే తెలుసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అందులో మార్పులు చేసి.. టైంలైన్‌ని స్క్రోల్ చేసినపుడు పోస్టును ఎవరు చేశారనే దాంతో పాటు ఫొటోలో ఎంతమంది ఉన్నారు..? వారు ఏ మూడ్‌లో ఉన్నారు..? ఏ ప్రదేశంలో దిగారు..? అన్న వివరాలను కూడా చెప్పేస్తుంది. ఫొటో బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్‌ను స్కాన్ చేసి.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చెబుతుందట.
'ఆబ్జెక్ట్ రికగ్నిషన్ టెక్నాలజీ'తో ఈ టూల్‌ను అభివృద్ధి చేసినట్లు ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ కొత్త ఫీచర్ తొలుత ఐఓఎస్ డివైజ్‌ల్లో అందుబాటులోకి రానుందట.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







