ఓవర్‌స్టే ఫైన్స్, పర్మిట్ల క్రమబద్ధీకరణ..
- February 25, 2023
యూఏఈ: వీసా సమస్యలు, దుబాయ్‌లో ఓవర్‌స్టే జరిమానాలు, గడువు ముగిసిన అనుమతులు మొదలైనవాటిని క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం వచ్చింది. GDRFA దుబాయ్ దెయిరా సిటీ సెంటర్లో ఫిబ్రవరి 25 నుండి 27 ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు 'ఏ హోమ్ ల్యాండ్ ఫర్ ఆల్' పేరుతో 3 రోజుల ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నివాసితులు, సందర్శకులు తమ వీసా సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఓవర్‌స్టే జరిమానాలు, గడువు ముగిసిన వీసా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వీసా గడువును మించి దాదాపు 10 సంవత్సరాలు ఎక్కువ కాలం దుబాయ్ లో గడిపినప్పటికీ ఈ ప్రత్యేక కేంద్రంలో పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. దేశంలో ఉండటానికి అనుమతులను క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని GDRFA దుబాయ్ సూచించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







