ఇంటీరియర్‌ డిజైనర్‌ కోసం 1 మిలియన్‌ డాలర్స్‌

- May 04, 2016 , by Maagulf
ఇంటీరియర్‌ డిజైనర్‌ కోసం 1 మిలియన్‌ డాలర్స్‌

ఇంటర్నేషనల్‌ డిజైన్‌ ప్రాక్టీస్‌ బినోయ్‌, బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కొత్త టెర్మినల్‌ భవనం కోసం డిజైనర్‌గా ఎంపిక చేయబ్డారు. కొత్త ప్యాసింజర్‌ టెర్మినల్‌కి బినాయ్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తారు. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆధునీకరణలో భాగంగా బినాయ్‌ని తీసుకున్నారు. అరబ్‌ టెక్‌ మరియు టిఎవి మధ్య 1.1 బిలియన్‌ (14.1 మిలియన్‌ బహ్రెయినీ దినార్స్‌) కాంట్రాక్ట్‌ కుదిరింది. న్యూ టెర్మినల్‌ బిల్డింగ్‌, మెయిన్‌ సర్వీస్‌ బిల్డింగ్‌, ఎయిర్‌ క్రాఫ్ట్‌ బే కోసం ఈ కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నారు. బహ్రెయిన్‌ చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూనే ఆధునికత ఉట్టిపడేలా ఇంటీరియర్‌ డిజైన్స్‌ని బినాయ్‌ రూపొందించనున్నారని బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com