2022లో ప్రజా రవాణాను ఉపయోగించిన 621.4 మిలియన్ల మంది
- February 27, 2023
దుబాయ్: 2022లో ప్రజా రవాణాను 621.4 మిలియన్ల మంది ఉపయోగించారని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. దుబాయ్ మెట్రో, దుబాయ్ ట్రామ్, పబ్లిక్ బస్సులు, సముద్ర రవాణా (అబ్రా, ఫెర్రీ, వాటర్ ట్యాక్సీ, వాటర్ బస్), షేర్డ్ మొబిలిటీ (ఇ-హెయిల్, స్మార్ట్ కార్)తో కూడిన ప్రజా రవాణా వ్యవస్థలో రైడర్‌షిప్ ఎక్కువగా ఉందని తెలిపింది. 2021లో 461 మిలియన్ల రైడర్స్ ఉన్న రైడర్‌షిప్ 35% పెరుగుదలను నమోదు చేసిందన్నారు. అదేవిధంగా ప్రజా రవాణా, షేర్డ్ మొబిలిటీ, టాక్సీల రోజువారీ సగటు రైడర్‌షిప్ 2021లో 1.3 మిలియన్ల రైడర్‌లు ఉండగా.. అది 2022లో 1.7 మిలియన్ల మందికి పెరిగింది. ఆర్టీఏ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తయ్యేర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దుబాయ్ పబ్లిక్‌లో మెట్రో రైడర్‌షిప్ 3% పెరిగిందని, మెరైన్ ట్రాన్స్‌పోర్ట్ రైడర్స్ 1% పెరుగుదలను చూపించాయని తెలిపారు.
దుబాయ్ మెట్రో 2022లో ప్రజా రవాణా, షేర్డ్ ట్రాన్స్‌పోర్ట్, టాక్సీల రైడర్‌షిప్‌లో అత్యధిక శాతాన్ని పొందింది. 2021 కంటే వరుసగా అవి 33%, 3%, 36% పెరిగుదల నమోదు చేసింది. ఇందులో పబ్లిక్ బస్సుల వాటా 25%కి చేరుకుంది. మెరైన్ ట్రాన్స్‌పోర్ట్ రైడర్‌లు 2021లో 2% నుండి 2023లో 3%కి పెరిగారు. డిసెంబర్‌లో 57 మిలియన్ల మంది ప్రయాణించగా.. ఇతర నెలల్లో రైడర్‌షిప్ రేట్లు 46 నుండి 56 మిలియన్ల వరకు ఉన్నాయి.
దుబాయ్ మెట్రో రైడర్ల సంఖ్య 2022లో 225.1 మిలియన్లకు చేరుకుంది. బుర్జుమాన్, యూనియన్ స్టేషన్‌లు రెడ్ అండ్ గ్రీన్‌లో ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌లు. 2022లో దుబాయ్ మెట్రో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రైడర్స్‌లో లైన్స్ అతిపెద్ద వాటాను కలిగి ఉన్నాయి. బుర్జుమాన్ స్టేషన్ రెడ్, గ్రీన్ లైన్‌లలో 13 మిలియన్ల రైడర్‌లకు సేవలు అందించగా.. యూనియన్ స్టేషన్‌ను 10.8 మిలియన్ రైడర్‌లు ఉపయోగించారు. రెడ్ లైన్‌లో ఉన్న అల్ రిగ్గా స్టేషన్ అత్యధిక సంఖ్యలో రైడర్‌లను ఆకర్షించి 9.9 మిలియన్లకు చేరుకుంది. ఆ తర్వాత మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ స్టేషన్ (9.6 మిలియన్లు), బుర్జ్ ఖలీఫా/దుబాయ్ మాల్ స్టేషన్ (8.8 మిలియన్లు), బిజినెస్ బే స్టేషన్ (8.5 మిలియన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గ్రీన్ లైన్‌లో ఉన్న షరాఫ్ DG రైడర్స్ 7.7 మిలియన్లను.. బనియాస్ స్టేషన్ (7.3 మిలియన్లు) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. స్టేడియం స్టేషన్ (5.6 మిలియన్లు), సలాహ్ అల్ దిన్ స్టేషన్ (5.3 మిలియన్లు), అల్ ఘుబైబా స్టేషన్ (4.9 మిలియన్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇతర రవాణా రైడర్లు
దుబాయ్ ట్రామ్ (7.5 మిలియన్లు), పబ్లిక్ బస్సులు (157.3 మిలియన్లు), అబ్రాస్, వాటర్ బస్సు, వాటర్ టాక్సీ, దుబాయ్ ఫెర్రీ (16 మిలియన్లు),ఇ-హెయిల్, స్మార్ట్ కార్ రెంటల్, బస్-ఆన్-డిమాండ్ (32.5 మిలియన్లు) నమోదుచేయగా.. దుబాయ్ టాక్సీ, ఫ్రాంచైజ్ కంపెనీలతో సహా టాక్సీలు 183 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలు అందించాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







