బర్త్‌డే స్పెషల్: కమెడియన్‌గా స్టార్ట్ చేసి, విలన్‌గా సెటిలైపోయిన సునీల్.!

- February 28, 2023 , by Maagulf
బర్త్‌డే స్పెషల్: కమెడియన్‌గా స్టార్ట్ చేసి, విలన్‌గా సెటిలైపోయిన సునీల్.!

మంచి టైమింగ్ వున్న కామెడీతో తనదైన శైలి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. అప్పట్లో ఏ హీరో సినిమా అయినా సరే, పక్కన సునీల్ కామెడీ వుండాల్సిందే. అంతలా సునీల్ తన కామెడీతో మెప్పించాడు. ఆ తర్వాతి కాలంలో హీరో అవతారమెత్తాడు. రాజమౌళి పుణ్యమే అదంతా. ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరో అయిపోయిన సునీల్ ఆ తర్వాత ‘పూల రంగడు’ సినిమాతో స్టార్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నాడు.

కానీ, ఆ పై కథల ఎంపికలో చేసిన పొరపాట్లు ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేశాయ్. దాంతో అటు కమెడియన్‌గానూ కాక, ఇటు హీరోగానూ కాక కొన్నాళ్లు సునీల్ కెరీర్ డౌన్ ఫాల్‌లో నడిచింది. ‘పుష్ప’ సినిమాతో మళ్లీ సునీల్ హవా మొదలైంది.

ఈ సారి ప్యాన్ ఇండియా రేంజ్ అందుకున్నాడు సునీల్. అయితే, విలన్‌గా. వైవిధ్యమైన విలనిజం ప్రదర్శిస్తూ టాలీవుడ్‌తో పాటూ, తమిళ తంబీల్నీ ఇంప్రెస్ చేశాడు సునీల్. ప్రస్తుతం ‘జైలర్’, ‘జపాన్’ తదితర తమిళ ప్రాజెక్టుల్లో సునీల్ భాగమైపోయాడు. ఈ రోజు సునీల్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు విషెస్ పోటెత్తుతున్నాయ్. సునీల్ ఇలాంటి బర్త్‌డేలు ఇంకెన్నో చేసుకోవాలని.. కెరీర్‌లో మంచి విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com