కుక్కల దాడిలో బాలుడి మృతి.. బాధిత కుటుంబానికి GHMC ఆర్ధిక సాయం
- February 28, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట్ లో గత ఆదివారం వీధికుక్కలు దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆ బాలుడి కుటుంబానికి GHMC.. రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.ఈ రోజు మంగళవారం హైదరాబాదులో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అఖిలపక్ష కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ తరఫున రూ.8 లక్షలు ప్రకటించగా, కార్పొరేటర్లు తమ ఒక నెల వేతనంతో మరో రూ.2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా, కుక్కల నివారణకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మరోపక్క వీధి కుక్కల విషయంలో GHMC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల బెడద నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
కుక్కల సంతాన నియంత్రణ ప్రక్రియను వేగవంతం చేయాలని… ఫిర్యాదు చేయగానే చర్యలు తీసుకునే యంత్రాంగం ఉండాలని ఆదేశించారు. అలాగే, జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి కుక్కల బెడదపై 040 21111111 నంబరుకు ఫోన్ చేసిన వెంటనే తగిన చర్యలు తీసుకునేలా, మైజీహెచ్‌ఎంసీ యాప్ ద్వారానూ ఫిర్యాదులు స్వీకరించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









