రమదాన్ 2023: 4 రోజులపాటు ఈద్ అల్ ఫితర్ వీకెండ్, ముస్లిమేతరులు ఉపవాసం ఉండాలా?
- March 01, 2023
యూఏఈ: నాలుగు సంవత్సరాల తర్వాత కోవిడ్ సంబంధిత పరిమితులు లేకుండా ఈ సంవత్సరం రమదాన్ నిర్వహించుకోనున్నారు. 2020, 2021, 2022 పవిత్ర మాసంలో మాస్క్ వాడకం, ప్రయాణంపై పరిమితులు, సమావేశాలు, మస్జీదులను సందర్శించడంలో కొన్ని రకాల పరిమితులు అమల్లో ఉండే. కానీ ఈ సంవత్సరం ఎలాంటి ఆంక్షలు లేకుండా స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఇఫ్తార్ (రమదాన్ ఉపవాసాన్ని ముగించడానికి సూర్యాస్తమయం తర్వాత తీసుకునే భోజనం) సమావేశాలను నిర్వహించుకోవచ్చు. మస్జీదుల్లో లేదా దేశంలోని ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో ఆరాధకులు మాస్క్లు ధరించాల్సిన అవసరం కూడా లేదు.
రమాదన్ సంబంధిత కొన్ని ప్రశ్నలు, సమాధానాలు
ఈ సంవత్సరం రమదాన్ ఎప్పుడు?
ఇస్లామిక్ క్యాలెండర్లో రంజాన్ తొమ్మిదవ నెల. హిజ్రీ క్యాలెండర్లోని అన్ని ఇతర నెలల మాదిరిగానే, చంద్రుడు కనిపించినప్పుడు ప్రారంభం అవుతుంది. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, ఉపవాస మాసం చాలావరకు మార్చి 23న ప్రారంభమవుతుంది.
పవిత్ర మాసం ఎంతకాలం ఉంటుంది?
నెలవంక కనిపించినప్పుడు చివరి తేదీలు నిర్ణయించినప్పటికీ, ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం పవిత్ర మాసం 29 రోజులపాటు ఉంటుంది.
ఈద్ అల్ ఫితర్ సెలవు ఎప్పుడు?
ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు ఏప్రిల్ 21న (శుక్రవారం) ఉండే అవకాశం ఉంది. యూఏఈ నివాసితులు రమదాన్ కోసం నాలుగు రోజుల వీకెండ్ ఆనందించవచ్చు. ఏప్రిల్ 20, (గురువారం) నుండి ఏప్రిల్ 23 (ఆదివారం) వరకు విరామం ఉంటుంది.
రమదాన్ సమయంలో వాతావరణ సూచన ఏమిటి?
పవిత్ర మాసం యూఏఈలో స్ప్రింగ్ సీజన్ లో ఉంటుంది కాబట్టి ఇది రమదాన్ సమయంలో ఆహ్లాదకరమైన ఉపవాస అనుభవం ఇస్తుంది. ఉష్ణోగ్రతలు 17 నుండి 36°C మధ్య ఉంటాయి.
ఉపవాస వ్యవధి ఎంత?
ఈ సంవత్సరం ఉపవాసం 14 గంటలపాటు ఉంటుంది. రమదాన్ ప్రారంభంలో, ఉపవాస సమయం 13 గంటల 30 నిమిషాలు ఉంటుంది. నెల ముగిసే సమయానికి ఈ వ్యవధి 14 గంటల 13 నిమిషాలకు పెరుగుతుంది.
పవిత్ర మాసంలో పాఠశాలలు మూసివేస్తారా?
ఈ సంవత్సరం పాఠశాలల స్ప్రింగ్ విరామం.. అకాడమిక్ ముగింపు సెలవులు పవిత్ర మాసం ప్రారంభంతో సమానంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు తమ కుటుంబాలతో నెలలో ఎక్కువ రోజులు ఇంట్లోనే గడపవచ్చు.
ముస్లిమేతరులు ఉపవాసం ఉండాలా?
ముస్లిమేతరులు రమదాన్ లో ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. యూఏఈ ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం.. వారు ఉపవాస సమయంలో బహిరంగంగా తినకూడదు, తాగకూడదు, పొగ తాగకూడదు.
ఉపవాస సమయంలో రెస్టారెంట్లు తెరిచి ఉంటాయా?
విజిట్ దుబాయ్ తన వెబ్సైట్లో రెస్టారెంట్లు, డైనింగ్ ఏరియాలు పగటిపూట యథావిధిగా పనిచేస్తాయని పేర్కొంది. చాలా డైనింగ్ స్పాట్లు తెరిచి ఉంటాయి. ముస్లిమేతరులకు, ముఖ్యంగా షాపింగ్ మాల్స్, హోటళ్లలో ఆహారాన్ని అందిస్తాయి.
పని గంటలు మారతాయా?
అవును, పవిత్ర మాసంలో పని గంటలు రెండు గంటలు తగ్గుతాయి. ప్రభుత్వ సేవా కేంద్రాలు సహా కార్యాలయాల సమయాలు మారనున్నాయి. అయితే మాల్స్, రెస్టారెంట్లు ఆలస్యంగా తెరిచి ఉంటాయి.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









