ఫ్రిజ్‌లో వుంచిన పుచ్చకాయ తింటున్నారా.?

- March 01, 2023 , by Maagulf
ఫ్రిజ్‌లో వుంచిన పుచ్చకాయ తింటున్నారా.?

చాలా మంది పుచ్చకాయని ఫ్రిజ్‌లో వుంచి తినడానికి ఇష్టపడుతుంటారు. అవును నిజమే. మండే వేసవిలో చల్ల చల్లగా పుచ్చకాయ ముక్కలు తింటుంటే భలే వుంటది. కానీ, వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కావల్సిన పోషకాలు.. విటమిన్లు, కార్భోహైడ్రేట్లు పుష్కలంగా వుండే పుచ్చకాయని ఫ్రిజ్‌లో వుంచడం వల్ల అందులో వుండే ఈ విటమిన్లన్నింటినీ కోల్పోవాల్సి వస్తుందని సంబంధిత ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్రిజ్‌లో పెట్టకుండా తిన్న పుచ్చకాయలో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, ఇ, సి విటమిన్లు అధికంగా వున్నాయనీ, ఫ్రిజ్‌లో పెట్టి తీసిన పుచ్చకాయ తింటే.. శరీరానికి ఎలాంటి విటమిన్లు అందడం లేదనీ ఆరోగ్యానికి అది ఎంతమాత్రమూ ఉపయోగకరం కాదనీ అంటున్నారు. 

అంటే, అర్ధమైందిగా.. వేసవి తాపం తట్టుకుని, డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి తినే పుచ్చకాయను ప్రిజ్‌లో పెట్టి తినాలంటే ఇప్పుడైనా కాస్త ఆలోచించాలి సుమా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com