రోడ్డెక్కనున్న ఒలెక్ట్రా ఈ-టిప్పర్లు..
- March 01, 2023విజయవాడ: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (OGL) 6×4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్లకు హోమోలోగేషన్ సర్టిఫికెట్‌ను పొందింది. భారతీయ ఆటో మొబైల్ నియంత్రణ సంస్థల నుంచి ఈ సర్టిఫికెట్ పొందినట్లు సంస్థ వెల్లడించింది. కేంద్రీయ మోటారు వాహన నింబంధనలకు అనుగుణంగా.. ఒలెక్ట్రా 6×4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ రోడ్డుపైకి వచ్చేందుకు అవసరమైన అన్నిఅనుమతులు సాధించింది. ఒలెక్ట్రా తయారు చేసిన దేశంలోనే తొలి ఈ-టిప్పర్ మన రహదారులకు అనువైనదో లేదో తెలుసుకునేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు, మైనింగ్, క్వారీతో సహా వివిధ ప్రాంతాలలో పరీక్షలు చేసి సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఒలెక్ట్రా ఈ-టిప్పర్లు హోమోలోగేషన్ సర్టిఫికెట్ పొందిన సందర్భంగా.. ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ. ప్రదీప్ మాట్లాడుతూ.. భారత దేశంలో ఎలక్ట్రిక్ హెవీ వెహికిల్ సెగ్మెంట్ లో ఒలెక్ట్రా ప్రధాన పాత్ర పోషిస్తోందని, తమ సంస్థలో తయారైన ఈ-టిప్పర్ దేశంలోనే మొట్ట మొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ గా నిలిచింది అని చెప్పారు. ఈ-టిప్పర్ ప్రోటో టైపును ఢిల్లీ, బెంగుళూరులో ప్రదర్శించామని.. ఇది ఔత్సాహికులకు గొప్ప ఉత్సుకతను, ఆసక్తిని కలిగించిందని తెలిపారు. 20 ఎలక్ట్రిక్ ఈ-టిప్పర్ల మొదటి ఆర్డర్‌కు సంబంధించి ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తామని ప్రదీప్ తెలిపారు. ఈ-టిప్పర్, ఎలక్ట్రిక్ ట్రక్కుల్లో వివిధ వేరియంట్లను కూడా విడుదల చేయబోతున్నామని.. తమ ప్రయాణంలో ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని వెల్లడించారు.
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్‌లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు