ముఖేష్ అంబానీ, అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు..

- March 01, 2023 , by Maagulf
ముఖేష్ అంబానీ, అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు..

ముంబై: ముంబైలో ఓ పాక్ ఉగ్రవాది ఎంటర్ అయ్యాడని ఎన్ఐఏ పోలీసు వర్గాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదిని పట్టుకునేందుకు జాతీయ సంస్థలు, పోలీసులు తీవ్రగాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ అగ్రనటులు అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడంతోపాటు ముంబైలో ఒక్కసారిగా కలకలం రేపింది. అగ్ర నటుల నివాసం వద్ద బాంబులు పెట్టామంటూ మంగళవారం ఉదయం నాగ్‌పుర్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఆగంతకుడు ఫోన్‌ చేశాడు.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. క్షణ్ణంగా పరిశీలించిన అనంతరం పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదని ముంబై పోలీసులు వెల్లడించారు.సమాచారం ప్రకారం.. అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్రతోపాటు యాంటిలియాలోని ముఖేష్ అంబానీ ఇంటికి కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బెదిరింపు కాల్స్‌ చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.

అయితే, అమితాబ్ బచ్చన్‌కు ముంబైలో ఐదు విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. అతని ఇళ్ల పేర్లు– జల్సా, జనక్, వత్స, ప్రతీక్ష. బచ్చన్‌లు ముంబైలో కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ప్రతీఖా. అమితాబ్ దివంగత తల్లిదండ్రులు నివసించే ఇల్లు ఇదే. ప్రస్తుతం బచ్చన్ కుటుంబం మొత్తం జల్సాలో నివసిస్తోంది. మరోవైపు ధర్మేంద్ర జుహూలోని బంగ్లాలో నివాసం ఉంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com