ఇవి ఉంటే చాలు.. 90 రోజుల విజిట్ వీసాను సులువుగా పొందవచ్చు
- March 02, 2023
యూఏఈ: యూఏఈ నివాసితులు తమ కుటుంబం, స్నేహితుల కోసం 90 రోజుల విజిట్ వీసాను పొందేందుకు అర్హులు. దీంతో ఈ వీసాను ఇప్పించాలని చాలామంది ట్రావెల్ ఏజెంట్లను కలుస్తున్నారు. కానీ అది వారి పరిధిలో లేదు. వాస్తవానికి 3-నెలల విజిట్ వీసా కోసం చాలా ఎక్కువ డిమాండ్ ఉందని, ప్రతిరోజూ దాదాపు 40వరకు కాల్స్ వస్తున్నాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. అయితే, నివాసితులు అమెర్ సెంటర్‌లో బంధువులు, స్నేహితుల కోసం 90రోజుల వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని..ఇందు కోసం Dh1,000 తిరిగి చెల్లించే డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
‘‘3-నెలల వీసాల గురించి వార్తలు వెలువడినప్పటి నుండి నివాసితులు తమ బంధువులు, స్నేహితులను 2 నెలల వీసాకు బదులుగా 90 రోజుల పాటు దుబాయ్‌కి తీసుకురావడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ వీసాల కోసం రోజూ దాదాపు 35-40 కాల్‌లను వస్తున్నాయి. అలాంటి వీసాలు జారీ చేయడంలో మా పాత్ర ఏమీ ఉండదని నేను అందరికీ వివరిస్తున్నాను. " అని రూహ్ ట్రావెల్ అండ్ టూరిజం సేల్స్ డైరెక్టర్ లిబిన్ వర్గీస్ తెలిపారు.
మరోవైపు 90 రోజుల విజిట్ వీసా కోసం GDRFA వెబ్‌సైట్‌లో లేదా యాప్‌లో ఆన్‌లైన్‌లో కూడా వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు. 2022 అక్టోబరులో అడ్వాన్స్‌డ్ వీసా సిస్టమ్‌లో భాగంగా యూఏఈలో ప్రవేశ వీసాలకు విస్తృత సంస్కరణలు చేయబడ్డాయి. ఇప్పటి వరకు యూఏఈలో అతిపెద్ద రెసిడెన్సీ, ఎంట్రీ పర్మిట్ సంస్కరణల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది.
సిద్ధిక్ ట్రావెల్స్ యజమాని తాహా సిద్దిక్ మాట్లాడుతూ.. తమ బంధువుల కోసం 3 నెలల వీసా జారీ చేయాలని నివాసితుల నుంచి తమకు నాన్‌స్టాప్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. కానీ, మేము తమ క్లయింట్‌లకు వీసాను జారీ చేయలేము లేదా దరఖాస్తు చేయలేమని తెలిపారు. అమెర్ సెంటర్‌ను సందర్శించాలని లేదా GDRFA వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మేము ప్రతి ఒక్కరికీ చెబుతున్నట్లు సిద్ధిక్ అన్నారు.
90 రోజుల విజిట్ వీసాకు అవసరమైన పత్రాలు
1. బంధువు లేదా స్నేహితుడి ఇటీవలి పాస్‌పోర్ట్.
2. దరఖాస్తుదారు ఎమిరేట్స్ ID కాపీ.
3. హోటల్ రిజర్వేషన్, నివాస వివరాలు
4. కుటుంబ సభ్యుల సందర్శన వీసా కోసం సంబంధానికి సంబంధించిన రుజువు.
5. బంధువు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కాపీ.
6. రిటర్న్ టికెట్ కాపీ.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









