రేపటి నుంచి విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు..షెడ్యూల్ విడుదల
- March 02, 2023
విశాఖపట్నం: విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. షెడ్యూల్ ఇలా… సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, రాత్రికి అక్కడే బస చేస్తారు. 3వతేదీన ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం జగన్ పాల్గొంటారు. రాత్రి 8.00 – 9.00 ఎంజీఎం పార్క్ హోటల్లో జీఐఎస్ డెలిగేట్స్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస చేస్తారు. అలాగే 4వతేదీ ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్‌మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









