ఎతిహాడ్ విమానం వత్తిడి గురి కావడంతో జకార్త లో 31 మంది గాయపడ్డారు

- May 04, 2016 , by Maagulf
ఎతిహాడ్ విమానం వత్తిడి గురి కావడంతో జకార్త లో  31 మంది  గాయపడ్డారు

ఎతిహాడ్ విమానయాన సంస్థకు చెందిన ఒక విమానం ఇండోనేషియన్ రాజధాని జకార్తాలో భూమి పైకి దిగేందుకు సిద్ధం అయ్యే సమయంలో విమానంలో ఒక ఆకస్మిక అల్లకల్లోలం ఎదుర్కొంది ఈ ఆకస్మిక పరిణామంలో  అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారని యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యొక్క జాతీయ విమానయాన సంస్థ  చెప్పారు.
ఎతిహాడ్ ఎయిర్వేస్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం అబూ ధాబీ విమానం  ఇ వై  474 సుకర్ణో హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ల్యాండింగ్  45 నిమిషాల ముందు  "తీవ్రమైన మరియు ఊహించని అల్లకల్లోలం " ఏర్పడిందని అన్నారు .
ఎట్టకేలకు విమానం సురక్షితంగా దిగింది కానీ  31 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అలాగే  తొమ్మిది మందిని  చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాద  తీవ్రతను వివరాలు ఇంకా  తెలియజేయలేదు . ఈ అల్లకల్లోలం కారణంగా విమానంలోని  క్యాబిన్ నిల్వ డబ్బాలు పాడు చేసినంత  తీవ్రంగా ఉంది అని  చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com