'రెంట్ నౌ పే లేటర్' ద్వారా ఇంటి అద్దె ఈజీగా..
- March 02, 2023
బెంగళూరు: అద్దె కట్టడానికి కూడా అస్సలు డబ్బులు లేవు. ఈ మంత్ చాలా టైట్.. తరుచుగా ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. ఏ అవసరమూ చెప్పి రాదు.. ఒక్కోసారి ఇలాంటి ఇబ్బందులు తప్పవు. అలాంటప్పుడు రెంట్ నౌ పే లేటర్ ఆప్షన్ కొండంత భరోసాని ఇస్తుంది. హౌసింగ్.కామ్ అనే సంస్థ ఈ వినూత్న అంశానికి శ్రీకారం చుట్టింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న నీరో అనే ఫిన్‌టెక్ స్టార్టప్‌తో చేతులు కలిపి దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చింది. సమయానికి డబ్బుల్లేని కస్టమర్లు ఆర్ఎన్‌పీఎల్ ద్వారా అద్దె చెల్లించవచ్చు. ఇందుకోసం ఎలాంటి కన్వీనియెన్స్ ఫీజు లేదు.పైగా నలభై రోజులల వరకు ఈ మొత్తంపై ఎలాంటి వడ్డీ ఉండదు. అవసరమైతే ఆ మొత్తాన్ని నెలవారీ ఈఎమ్‌ఐ రూపంలో చెల్లించొచ్చు. క్రెడిట్‌పై అద్దెకు తీసుకోవాలనుకునే వారికి కార్డు లేకపోతే ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుంది అని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. ఈ సేవల్ని ప్రారంభించడానికి ముందే ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు అగర్వాల్ తెలిపారు. దాదాపు లక్ష మంది యూజర్లు ఈ సేవలను ఉపయోగించుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..