108 వాహనాలను ట్రాక్ చేసే పద్ధతిని తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం

- March 02, 2023 , by Maagulf
108 వాహనాలను ట్రాక్ చేసే పద్ధతిని తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాల్లో ఉన్న వారి కోసం 108 వాహనాలను ట్రాక్ చేసే పద్ధతిని తీసుకరాబోతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే 108 కు కాల్ చేస్తాం..108 వాహనం వచ్చేవరకు ఎదురుచూస్తుంటాం..కొన్నిసార్లు 108 వాహనం ఆలస్యమైతే ప్రవైట్ వాహనాల్లో బాధితుడిని తీసుకెళతాం. అయితే ఇప్పుడు ఏపీ సర్కార్.. ఓలా, ఊబర్, రాపిడో లాంటి వెహికిల్స్​ను ట్రాక్ చేసే తరహాలోనే.. 108 వాహనాలనూ ట్రాక్ చేసే పద్ధతిని ఏపీ వైద్య శాఖ ప్రవేశపెడుతోంది.

ఈ ట్రాకింగ్ విధానం వల్ల 108 వాహనం ఎక్కడ వరకు వచ్చింది? ఎంతసేపట్లో తమ దగ్గరకు వస్తుందనే విషయాలను బాధితులు ట్రాక్ చేసే వీలుంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్ రన్​ సక్సెస్​ఫుల్​గా ముగిసిందని తెలుస్తోంది. అంబులెన్స్​ల ట్రాకింగ్ సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆరోగ్యశ్రీ మీద నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ అంబులెన్స్​ వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్​ గురించి ఆఫీసర్స్​ను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ట్రాకింగ్ సిస్టమ్​ను అమలు చేస్తామని రజిని తెలిపారు. అంబులెన్స్ ఎక్కడుందో తెలుసుకునేందుకు మొబైల్స్​కు రూట్ మ్యాప్​ లింక్​ను పంపేందుకు ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com