దుబాయ్‌లో Dh300 విలువ దాటిన వస్తువులపై కస్టమ్స్ సుంకం తొలగింపు

- March 03, 2023 , by Maagulf
దుబాయ్‌లో Dh300 విలువ దాటిన వస్తువులపై కస్టమ్స్ సుంకం తొలగింపు

యూఏఈ: అంతర్జాతీయంగా 300 దిర్హాం కంటే ఎక్కువ విలువతో కొనుగోలు చేసే వస్తువులపై అమలవుతున్న కొత్త కస్టమ్స్ సుంకాన్ని నిలిపివేయాలని దుబాయ్ నిర్ణయించింది. ఈ మేరకు దుబాయ్ కస్టమ్స్ విభాగం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 1,000 దిర్హాం దాటిన పార్శిల్స్, షిప్‌మెంట్‌లపై కస్టమ్ సుంకం విధించనున్నట్లు పేర్కొంది. కొత్త కస్టమ్ సుంకం నిబంధనలు మార్చి 1 నుండి అమలులోకి వచ్చినట్లు తెలిపింది.  ఈ ఏడాది జనవరిలో దుబాయ్ అంతర్జాతీయంగా 300 దిర్హామ్ కంటే ఎక్కువ విలువైన వస్తువులపై కొత్త కస్టమ్స్ సుంకాన్ని ప్రవేశపెట్టింది. ఇంతకు ముందు కొనుగోలు చేసిన వస్తువులు Dh1,000 కంటే ఎక్కువ విలువ ఉంటేనే కస్టమ్ సుంకం వర్తించేది. అంతర్జాతీయంగా షాపింగ్ చేసే నివాసితులు ఐదు శాతం దిగుమతి కస్టమ్స్ సుంకం, ఐదు శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లించాలి. పొగాకు, పొగాకు ఉత్పత్తులు, ఇ-సిగరెట్లు, వేపింగ్ లిక్విడ్‌లపై 200 శాతం చొప్పున సుంకం వర్తిస్తుందని దుబాయ్ కస్టమ్స్ విభాగం తెలిపింది. 2017లో యూఏఈలో కార్బోనేటేడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, పొగాకు, పొగాకు ఉత్పత్తుల వంటి మానవ ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్నును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఇ-స్మోకింగ్ పరికరాలు, సాధనాలను ఎక్సైజ్ పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com