2022లో కువైట్ విడిచిన 178,919 మంది ప్రవాసులు
- March 03, 2023
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022 సంవత్సరంలో 178,919 మంది ప్రవాసులు కువైట్ విడిచిపెట్టారు. 2022 సంవత్సరం మధ్య నాటికి మొత్తం ప్రవాస కార్మికుల సంఖ్య 2 మిలియన్ల 718 వేల 803 మంది. అదే 2021లో వారి సంఖ్య సుమారు 2 మిలియన్ల 897 వేల 522 మంది. దాదాపు 178,919 మంది ప్రవాసులు కువైట్ నుండి ఒక సంవత్సరంలో శాశ్వతంగా వెళ్లిపోయారని అథారిటీ నివేదిక స్పష్టం చేస్తుంది. అదే విధంగా యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబడిన 17,891 మంది ప్రవాసులు ఆరోగ్య బీమా రుసుము అమలు చేసిన తర్వాత దేశం విడిచిపెట్టారు. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రవాస కార్మికుల సంఖ్య 2021 మధ్యలో దాదాపు 122,536 నుండి 2022 మధ్య నాటికి 104,645కి తగ్గింది. యూనివర్శిటీ డిగ్రీ హోల్డర్‌లలో 2021 మధ్యలో 155,665 నుండి 2022 మధ్యలో 146,942కి తగ్గుదల నమోదైంది. దీనికితోడు పోస్ట్ గ్రాడ్యుయేట్ల సంఖ్య కూడా 2021 మధ్యలో 7,213 నుండి 2022 మధ్యలో 6,912కి తగ్గింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..