మార్చి 7న కల్చరల్ హాల్‌లో ‘కవ్వాలీ నైట్’

- March 04, 2023 , by Maagulf
మార్చి 7న  కల్చరల్ హాల్‌లో ‘కవ్వాలీ నైట్’

బహ్రెయిన్: నవాజ్ సబ్రీ నేతృత్వంలో భారతదేశంలోని ప్రఖ్యాత సూఫీ సంగీత విద్వాంసుల ఖవ్వాలి ప్రదర్శన మార్చి 7న  రాత్రి 8 గంటలకు కల్చరల్ హాల్‌లో ప్రారంభం కానుంది. స్ప్రింగ్ ఆఫ్ కల్చర్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ (BACA) నిర్వహిస్తుంది.

ఉస్తాద్ నవాజ్ సబ్రీ ప్రముఖ కవ్వాల్ కుటుంబానికి చెందినవారు. అతని తాత ఉస్తాద్ నిజాం రగి, తండ్రి ఉస్తాద్ సమర్ నిజామీ వారి కాలంలో ప్రసిద్ధ ఖవ్వాలి కళాకారులుగా ప్రసిద్ధి పొందారు. ప్రస్తుతం, ఉస్తాద్ నవాజ్ సబ్రీ తన సోదరులు అన్వర్ నిజామీ, ఉస్తాద్ హాజీ అస్లాం సబ్రీతో కలిసి కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఖవ్వాలీ నైట్ ను బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌తో కలిసి BACA నిర్వహిస్తుంది. ప్రవేశం ఉచితం. బహ్రెయిన్‌లోని సంగీత ప్రియులందరు ఈ కార్యక్రమానికి వచ్చి భారతీయ సూఫీ సంగీత విద్వాంసుల ఖవ్వాలీ నైట్ ని ఆస్వాదించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com