నైజీరియా నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం..12 మంది మృతి
- March 04, 2023
నైజీరియా: నైజీరియాలోని నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కేంద్రం వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. పలు వాహనాలు దగ్ధం అయ్యాయి. ఆయిల్ రిఫైనరీ కర్మాగారానికి సమీపంలో పేలుడు సంభవించింది. ఆయిల్ పైప్ లైన్ కు రంధ్రం ఏర్పడి మంటలు చెలరేగాయి. గంటల తరబడి ఎగిసిపడిన మంటల ధాటికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉత్తర జకార్తాలోని తనహ్ మెర పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓ ఆయిల్ డిపోలో భారీ పేలుడు సంభవించింది.
భారీ వర్షంతో పాటు పిడుగులు పడటంతో ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత ఇది అనేక పేలుళ్లకు కారణమైంది. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడం వల్ల అగ్నిమాపక అధికారులు నివాస ప్రాంతాల్లో ఉండే వేలాది మంది ప్రజలను హుటాహుటినా ఖాళీ చేయించారు. భారీ అగ్ని ప్రమాదంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







