కరివేపాకును లైట్ తీసుకుంటున్నారా.? అయితే మీకీ సంగతి తెలియాల్సిందే.!

- March 04, 2023 , by Maagulf
కరివేపాకును లైట్ తీసుకుంటున్నారా.? అయితే మీకీ సంగతి తెలియాల్సిందే.!

కరివేపాకు లేకుండా ఏ కూర వుండదు. కానీ, కూరలో కరివేపాకు కనిపిస్తే చాలు తీసి పక్కన పడేస్తుంటాం. కరివేపాకుతో వచ్చే ఆరోగ్య విషయాలు తెలిస్తే ఇకపై కరివేపాకును అస్సలు లైట్ తీసుకోరు.

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటూ విటమిన్ సి, ఇ, ఏ పుష్కలంగా వుంటాయ్. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే లక్షణం కూడా కరివేపాకుకు అధికం అట. 
కరివేపాకులోని అరోమా నాడీ కణాలను ఉత్తేజపరిచి రోజంగా ఉత్సాహంగా వుండేందుకు తోడ్పడుతుంతి. మూత్రంలో మంట, కిడ్నీ ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా చేస్తుంది. 

ప్రతి రోజూ కరివేపాకు కషాయం తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో మెండు అని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఓ నాలుగు కరివేపాకు ఆకులను నీళ్లలో మరిగించి, అందులో కాస్త నిమ్మరసం, తేనె కలిపి రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అదీ సంగతి.. కరివేపాకుతో ఆరోగ్యం ఎంతో తెలిసిందా.? ఇకపై కరివేపాకును తీసి పారేయడం మానేసి, కళ్లకు అద్దుకుని తినేయడం అలవాటుగా చేసుకుంటే బావుంటుందిగా మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com