అట్టహాసంగా ప్రారంభమైన WPL..
- March 05, 2023
ముంబై: మహిళా క్రికెట్ చరిత్రలో నూతనశకం ఆవిష్కృతమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన ఆరంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ నటీమణులు కియారా అద్వానీ, కృతి సనన్ ప్రత్యేక నృత్య ప్రదర్శనలతో అలరించాయి. అనంతరం ఐదు జట్ల కెప్టెన్లు స్టేడియంలో డబ్ల్యూపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు. అనంతరం తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగింది. తొలి మ్యాచ్ లో ముంబయి జట్టు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించడంతో తొలిమ్యాచ్‌లోనే 142 పరుగుల తేడాతో ముంబయి విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ పరుగుల వరద పారించారు. కేవలం 30 బంతుల్లో 65 రన్స్ తో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడారు.
డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ లో పరుగుల వరద పారింది. అలాగే వికెట్ల మోతా మోగింది. ఈ రెండు విభాగాల్లోనూ ముంబయి జట్టు పైచేయిసాధించి గుజరాత్ జెయింట్స్ జట్టును చిత్తుచేసింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ టాస్ గెలవడంతో బౌలింగ్ తీసుకుంది. టాస్ ఓడిన ముంబయి జట్టు ఆటగాళ్లు క్రీజులోకి వచ్చి పరుగుల వరద పారించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అత్యధిక పరుగులు చేసింది. కేవలం 30 బంతుల్లో 65 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఈ క్రమంల 14 ఫోర్లు కొట్టింది. ఓపెనర్ హేలీ మాథ్యూ 31 బంతుల్లో 47 పరుగులు రాబట్టింది. ఆమె ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి. దీంతో ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవరక్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.
208 పరుగుల లక్ష్యసాధనకోసం బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ప్లేయర్లు ముంబయి బౌలర్ల ధాటికి కుదేలయ్యారు. ఓపెనర్లు సబ్బినేని మేఘన (2), బెత్ మూనీ (0) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. కేవలం 12 పరుగులకే గుజరాత్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనుకుంటున్న సమయంలో హేమలత (29) పోరాడి కాస్త పరుగులు రాబట్టింది. దీంతో కేవలం 15.1 ఓవర్లకే 64 పరుగులకు గుజరాత్ జెయింట్స్ ఆలౌట్ అయింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా హర్మన్ ఎంపికైంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..